Rohit Sharma | రోహిత్ శ‌ర్మ‌తోనే.. ఆ స‌మ‌స్య‌కి చెక్ పెట్టాల‌ని అనుకుంటున్నారా! షాక్‌లో ఫ్యాన్స్

Rohit Sharma | మ‌రి కొద్ది రోజుల‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లు కానుంది. భార‌త్ వేదిక‌గా ఈ టోర్నీ జ‌ర‌గ‌నుండ‌డంతో టీమిండియా టైటిల్ ఫేవ‌రేట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. కాని భార‌త జ‌ట్టు తీరు చూస్తే ప‌క్కాగా గెలుస్తుంద‌ని ఎవ‌రు చెప్ప‌లేక‌పోతున్నారు. ప‌స‌లేని బౌలింగ్, స‌మ‌యానికి అద్భుత‌మైన ఆటతీరు చూప‌ని ఆట‌గాళ్ల వ‌ల‌న టీమిండియా పక్కాగా క‌ప్ కొడుతుంద‌ని ఎవ‌రు క‌న్‌ఫాంగా చెప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం టీమిండియాకి నాలుగో నెంబ‌ర్ పెద్ద స‌మ‌స్య‌గా మారింది. 2019 వరల్డ్ కప్‌లో […]

  • Publish Date - August 12, 2023 / 11:28 AM IST

Rohit Sharma |

మ‌రి కొద్ది రోజుల‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లు కానుంది. భార‌త్ వేదిక‌గా ఈ టోర్నీ జ‌ర‌గ‌నుండ‌డంతో టీమిండియా టైటిల్ ఫేవ‌రేట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. కాని భార‌త జ‌ట్టు తీరు చూస్తే ప‌క్కాగా గెలుస్తుంద‌ని ఎవ‌రు చెప్ప‌లేక‌పోతున్నారు. ప‌స‌లేని బౌలింగ్, స‌మ‌యానికి అద్భుత‌మైన ఆటతీరు చూప‌ని ఆట‌గాళ్ల వ‌ల‌న టీమిండియా పక్కాగా క‌ప్ కొడుతుంద‌ని ఎవ‌రు క‌న్‌ఫాంగా చెప్ప‌డం లేదు.

ప్ర‌స్తుతం టీమిండియాకి నాలుగో నెంబ‌ర్ పెద్ద స‌మ‌స్య‌గా మారింది. 2019 వరల్డ్ కప్‌లో కూడా ఇదే స్థానం చాలా పెద్ద స‌మ‌స్య‌గా మార‌గా, అప్ప‌టి వ‌ర‌కు నాలుగో స్థానంలో ఆడిన రాయుడు ప్లేస్‌లో విజ‌య్ శంక‌ర్‌ని తీసుకొచ్చారు. ఆ నిర్ణ‌యం బెడిసి కొట్టింద‌నే చెప్పాలి.

ఇప్ప‌టి టీంలో కూడా నాలుగో స్థానం చాలా ఇబ్బందిగా మారింది. ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసే సరైన ఆట‌గాడు దొర‌క‌డం లేదు. ఈ క్ర‌మంలో టీమిండియా మేనేజ్‌మెంట్ షాకింగ్ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది.

ఏ ఫార్మాట్‌లో అయిన ఓపెనర్‌గా భారీ సక్సెస్ చవిచూసిన కెప్టెన్ రోహిత్ శర్మను నాలుగో స్థానంలో పంపి, అతని తర్వాత ఐదో నెంబర్‌లో కేఎల్ రాహుల్‌ని తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యానికి కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ఫిట్‌నెస్ సాధించని ప‌క్షంలో టీమిండియా మేనేజ్‌మెంట్ రోహిత్‌ని నాలుగో స్థానంలో పంపాల‌ని చూస్తున్నార‌ట‌.

ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవ‌కాశం ఉంది. శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడప్పుడే పూర్తిగా కోలుకునేలా కనిపించడం లేదు. వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకొని క్రమంగా కోలుకుంటున్నాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ మంచి న్యాయం చేసిన కూడా ఇప్పుడ‌ప్పుడే అత‌ను జ‌ట్టులోకి రావ‌డం క‌ష్టంగా క‌నిపిస్తుంది.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఆసియా క‌ప్ స‌మ‌యానికి రాహుల్, అయ్యర్ కనుక ఫిట్‌నెస్ సాధించని పక్షంలో వీరిద్ద‌రిని వరల్డ్ కప్ బృందంలో కూడా ఎంపిక చేయడం అనుమాన‌మే. నాలుగో నెంబ‌ర్ కోసం సంజూ శాంస‌న్ లేదంటే సూర్య కుమార్ యాదవ్‌ని సైతం ప‌రిశీలిస్తున్నారు. విండీస్‌తో టీ20ల్లో రాణిస్తున్న తిలక్ వర్మను కూడా నాలుగో నెంబర్ కి
ఎంపిక చేసిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.