Roja: చిరంజీవి చెబితే మేము వినం.. రోజా స్ట్రాంగ్ కౌంట‌ర్

Roja:వాల్తేరు వీర‌య్య వేడుక‌లో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం సినిమా ప‌రిశ్ర‌మ‌పై ప‌డి ఏడుస్తుంద‌ని, ప్ర‌జ‌ల బాగోగులు గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ట్టు ఆయ‌న కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నాయ‌కులు కొడాలి నాని , అమర్ నాథ్, పేర్ని నాని , రోజా వంటి వారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన రోజా.. సినిమా ఇండస్ట్రీలో పెద్దరికంగా వ్యవహరించాల్సిన చిరంజీవి తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది […]

  • Publish Date - August 9, 2023 / 10:55 AM IST

Roja:వాల్తేరు వీర‌య్య వేడుక‌లో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం సినిమా ప‌రిశ్ర‌మ‌పై ప‌డి ఏడుస్తుంద‌ని, ప్ర‌జ‌ల బాగోగులు గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ట్టు ఆయ‌న కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నాయ‌కులు కొడాలి నాని , అమర్ నాథ్, పేర్ని నాని , రోజా వంటి వారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన రోజా.. సినిమా ఇండస్ట్రీలో పెద్దరికంగా వ్యవహరించాల్సిన చిరంజీవి తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడం సరిగా లేద‌ని అన్నారు. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడేది ఒక్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే అని ఏపీ ప‌ర్యాట‌క శాఖా మంత్రి రోజా అన్నారు. చిరంజీవి స‌ల‌హాలు ఏమైన ఇవ్వాల‌ననుకుంటే ఆయన త‌మ్ముడికి ఇస్తే మంచిది.

బ్రో సినిమాలో మంత్రి అంబటి క్యారెక్టర్ పెట్టి ఆయ‌న‌ని అవమానించారు కాబట్టి అంబటి రియాక్ట్ అయ్యారు అని రోజా చెప్పుకొచ్చారు. సినిమా టిక్కెట్ రేట్స్ పెంచ‌మ‌ని హీరోలందరూ జగన్ దగ్గరకు ఎందుకెళ్లారని ఆమె ప్రశ్నించారు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని ఆమె గుర్తు చేశారు.

రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఏం మాట్లాడ‌ని చిరంజీవి, హోదా గురించి కూడా ఎందుకు అడగ లేదని మంత్రి ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అని ఆమె ప్ర‌శ్నించారు. గ‌డపగడపకు వచ్చి చూస్తే ఎన్ని రోడ్లు వేశామో ఆయ‌న‌కి అర్ధ‌మ‌వుతుంద‌ని రోజా స్ప‌ష్టం చేశారు.

చిరంజీవి చెబితే వినే ప‌రిస్థితిలో జ‌గ‌న్ అన్న లేరు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి లబ్ధి పొందారని, ఆయ‌న‌ రాష్ట్రానికి చేసింది ఏమి లేద‌ని విమ‌ర్శించారు.. అంత‌క‌ముందు అమ‌ర్‌నాథ్ మాట్లాడుతూ.. సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో చిరంజీవి చెప్పాలని అన్నారు.

అసలు మంత్రి అంబటి రాంబాబు క్యారెక్టర్ సృష్టించింది ఎవరు అని అమర్ నాథ్ దుయ్యబట్టారు. ఇక అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ.. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అన్నయ్య గారు అంటూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారో లేదో చిరంజీవినే చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు.