విధాత: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త బైక్‌ను భారత్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ బైక్ పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450. కొత్త మోడల్ బైక్‌లో 450సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. 450 హెచ్‌పీ పవర్‌ని, 40 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేయనున్నది. బైక్ బరువు 196కేజీల వరకు ఉంటుంది. ఇందులో 17 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉండగా.. 825ఎంఎం అడ్జెస్టెబుల్ సీట్ హైట్ ఉంటుంది.
బైక్ రౌండ్ టీఎఫ్టీ కలర్ స్క్రీన్ వస్తుండగా.. గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేటెడ్‌గా ఉంటుంది. స్క్రీన్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్స్, నోటిఫికేషన్స్, ఎస్‌ఎంఎస్‌లను సైతం యాక్సెస్ చేసుకునే వీలుంది. బైక్‌లో అదనంగా రైడ్ బై వైర్ టెక్నాలజీ, స్విచ్చేబుల్ ఏబీఎస్, ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్‌తో వస్తుంది. బైక్‌లో 21/17 ఇంచ్ స్పోక్ వీల్స్ ఉండగా.. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్‌లో షోవా యూఎస్‌డీ ఫోర్క్స్, రియర్‌లో మోనో షాక్ అబ్సార్బర్స్ ఉండగా.. ఫ్రంట్, రియర్‌లో డిస్క్ బేక్స్ ఉన్నాయి.
ధర ఎంత అంటే..?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450లో బైక్ మోడల్‌లో మూడు వేరియంట్లు ఉండనున్నాయి. అవి బేస్, పాస్, సమిట్. బేస్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.2.69లక్షలు కాగా.. పాస్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.2.74లక్షలు. సమిట్ వేరియంట్ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ.2.84లక్షలు. ఇంట్రొడక్టరీ ధరగా తెలుస్తుండగా.. డిసెంబర్ 31 వరకు ఇవే ధరలు కొనసాగనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత బైక్ ధరను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ హిమాలయన్ 450 బైక్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కంపెనీకి చెందిన డీలర్‌షిప్ షోరూముల్లో బైక్‌లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ బైక్ కేటీఎం 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్ తదితర బైక్స్‌కు మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వనుందని టాక్ నడుస్తున్నది. ఇదిలా ఉండగా.. కంపెనీకి చెందిన హిమాలయన్ 411 మోడల్‌ను డిస్ కంటిన్యూ చేయనున్నట్లు ప్రకటించింది. 2016లో లాంచ్ అయిన ఈ మోడల్ బైక్‌కు అడ్వెంచర్ టూరింగ్ బైక్‌గా గుర్తింపు పొందడం విశేషం.