ఆ.. నియోజ‌క‌వ‌ర్గాల‌కు రూ.162.88 కోట్ల నిధులు మంజూరు: మంత్రి

విధాత, మెదక్ బ్యూరో: జిల్లాలోని మెదక్, నరసాపూర్ నియోజక వర్గాలలోని గిరిజన ప్రాంతాల రోడ్లు, పంచాయత్ రాజ్ రోడ్లు, భవనాల రోడ్లకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు బుధవారం తెలిపారు. జిల్లాలో బి.టి. రోడ్ల‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.162.88 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మెదక్ నియోజక వర్గంలోని 43 .10 కిలో మీటర్ల రహదారుల‌ నిర్మాణానికి రూ.44 కోట్ల 33 లక్షలు, నరసాపూర్ నియోజక […]

  • Publish Date - December 14, 2022 / 03:08 PM IST

విధాత, మెదక్ బ్యూరో: జిల్లాలోని మెదక్, నరసాపూర్ నియోజక వర్గాలలోని గిరిజన ప్రాంతాల రోడ్లు, పంచాయత్ రాజ్ రోడ్లు, భవనాల రోడ్లకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు బుధవారం తెలిపారు. జిల్లాలో బి.టి. రోడ్ల‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.162.88 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు.

మెదక్ నియోజక వర్గంలోని 43 .10 కిలో మీటర్ల రహదారుల‌ నిర్మాణానికి రూ.44 కోట్ల 33 లక్షలు, నరసాపూర్ నియోజక వర్గంలో 89 .01 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.69 కోట్ల 41 లక్షలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అదేవిధంగా పంచాయత్ రాజ్ శాఖ ద్వారా రెండు నియోజక వర్గాలలో 110 .42 కిలో మీటర్ల రహదారుల నిర్మాణానికి గాను 43 పనులు చేపట్ట‌డానికి రూ.49 కోట్ల 14 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. తద్వారా రోడ్లు కొత్త రూపు సంతరించుకొని రవాణా సౌకర్యం సులభతరమవుతుందని, వాహ‌నదారుల ఇక్కట్లు తీరనున్నాయని ఆయన తెలిపారు.

మెదక్ నియోజకవర్గం
మెదక్ మండలంలో తిమ్మక్కపల్లి తండా, బాలానగర్ తండా, వెంకటాపూర్ తండా, మల్కాపూర్ తండా, సంగాయి గుడి తండా లలో 5 .05 కిలోమీటర్ల బి.టి. రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్ల 6 లక్షలు, రామాయమపేట్ మండలంలో దమరచెరువు తండా, సదాశివనగర్ తండా, బిల్యా తండా, బిక్షపతి తండా, పెద్ద తండా, రామాయంపేట తండాలలో 12 . కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.13 కోట్ల 72 లక్షలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.

అదేవిధంగా హవేళిఘనాపూర్ మండలంలో లింగసంపల్లి తండా, సూర్య తండా, శుక్లాల్ పెట్ తండా, కొత్తచెరువు తండా, గజిరెడ్డిపల్లి బంజారా తండాలలో 7 .40 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.7 కోట్ల 50 లక్షలు, పాపన్నపేట మండలంలో అన్నారం తండా, సీతయ్య తండా లలో 4 .05 కిలో మీటర్లకు రూ.4 కోట్లు, నిజాంపేట్ మండలంలో కాసీంపుర తండా, శౌకత్ పల్లి తండా లలో 5 . 10 కిలో మీటర్లకు రూ.4 కోట్ల 95 లక్షలు, శంకరంపేట్ మండలంలో కొర్విపల్లి తండా, జంగరల్ ఎల్.టి. సూరారం ఎల్.టి., చందంపేట, మిర్జాపల్లి ఎల్.టి. గవ్వలప్లల్లి ఎల్.టి. లలో 8 .6 కిలో మీటర్ల నిర్మాణానికి రూ.9 కోట్ల 10 లక్షలు మంజూరు చేశామని ఆయన తెలిపారు.

నర్సాపూర్ నియోజక వర్గం
నరసాపూర్ మండలంలో చిన్న చింత కుంట నుండి రూప్లా తండా, జువ్వి పోచమ్మ తండా, తిరుమలాపూర్ ఎల్.టి. విల్య తండా, రాంజ్య తండా, ధర్మ ఎల్.టి. లలో 15.8 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.11 కోట్ల 67 లక్షలు, శివ్వంపేట మండలంలో గుమ్మడిదల జెడ్.పి రోడ్డు నుండి రాజులు తండా వరకు, ఫకీర తండా, చర్చి తండా, శంకర్ తండా, సికింద్లాపూర్ తండాలలో 10.51 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.7 కోట్ల 48 లక్షలు, వెల్దుర్తి మండలంలో రామయంపల్లి రోడ్డు నుండి ఎల్దుర్తి వరకు, శెట్టిపల్లి కాలం తండా లలో 5 కిలో మీటర్ల రహదారికి రూ.3 కోట్ల 86 లక్షలు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు.

అదేవిధంగా మాసాయిపేట మండలంలో కొప్పులపల్లి నుండి కొప్పులపల్లి ఎల్.టి. వరకు 2 కిలో మీటర్ల రహదారికి రూ.కోటి 28 లక్షలు, కౌడిపల్లి మండలంలో లింగంపల్లి ఎల్.టి. నుండి సోమ్లా ఎల్.టి వరకు, లింగంపల్లి జెడ్.పి .రోడ్డు, మెదక్-జోగిపేట పి .డబ్ల్యు.డి. రోడ్డు, కౌడిపల్లి లోని ట్యాంక్ బండ్ , కౌడిపల్లిలోని పెద్ద చెరువు ప్రాంతాలలో 15 .5 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.12 కోట్ల 79 లక్షలు మంజూరు చేశామన్నారు.

అలాగే చిల్పిచెడ్ మండలంలో శీలంపల్లి నుండి మొండి తండా వరకు, రహీం గూడా నుండి ఫైజాబాద్ ఎల్.టి. వరకు, శీలంపల్లి నుండి సోమక్క తండా, బట్టు తండా వ రకు, గౌతాపూర్ ఎల్.టి. నుండి రాందాస్ గూడా వరకు 16 .65 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.13 కోట్ల 56 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు.

ఇక కొల్చారం మండలంలో జెడ్.పి . రోడ్డు నుండి జలబై తండా వరకు, తుమ్మలపల్లి ఎల్.టి. నుండి పోతిరెడ్డిపల్లి వరకు, యెన్.జలాల్పూర్ నుండి యెన్.ఎస్.ఎఫ్. రోడ్ వరకు, పి .డబ్ల్యు.డి. రోడ్డు నుండి వాల్య తండా, నాణ్య తండా వరకు 12. 45 కిలో మీటర్ల రహదారికి రూ.11 కోట్ల 18 లక్షలు, సంగారెడ్డి జిల్లా హతనూరా మండలంలో 3.6 కిలో మీటర్ల బి.టి. ర‌హ‌దారి నిర్మాణానికి రూ.2 కోట్ల 44 లక్షలు నిధులు మంజూరు చేశామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.