విధాత: అదృష్టమంటే ఇదే. బతుకుదెరువు కోసం పోయిన ఓ యువకుడికి అదృష్టం కలిసొచ్చింది. కోటీశ్వరుడు అయిపోయాడు. అది కూడా తెలంగాణ యువకుడు. జగిత్యాల జిల్లా వాసికి దుబాయ్‌లో భారీ లాటరీ తగిలింది.
ఫ్రిజ్‌లోకి దూరిన నాగుపాము.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
ఒకట్రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ. 30 కోట్ల భారీ లాటరీ తగలడంతో ఆ యువకుడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దుబాయ్‌లోని ఓ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్న అజయ్.. ఇటీవలే 30 దిర్హమ్స్‌తో రెండు లాటరీ టికెట్లను కొన్నాడు. అజయ్ స్వగ్రామం జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరు.