విధాత: న్యూ ఇయర్ వేడుకలకు కొద్ది రోజుల ముందు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మరోసారి కలకలం సృష్టించాయి. రూ. 50 కోట్ల విలువ చేసే 25 కిలోల డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ తయారీ చేస్తున్న రెండు ల్యాబ్‌లను సీజ్ చేసి, ఏడుగురుని అరెస్టు చేశారు. ఈ నెల 21న హైదరాబాద్‌లో డీఆర్ఐ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. ఈ ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
నేపాల్ పారిపోతుండగా ప్రధాన నిందితుడు అరెస్ట్
ఈ డ్రగ్స్ తయారీ కేసులో ప్రధాన నిందితుడు నేపాల్ పారిపోతుండగా, యూపీలోని గోరఖ్‌పూర్‌లో అతన్ని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. రూ. 60 లక్షలతో పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ ఏడుగురిలో కొందరిపై గతంలోనే డ్రగ్స్ తయారీ కేసులు ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. కొందరిపై హైదరాబాద్‌లో హత్య కేసులు, వడోదరలో దోపిడీ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.