Rythu Bandhu Scheme | రైతులకు గుడ్‌న్యూస్‌.. రేపటి నుంచి ఖాతాల్లోకి రైతుబంధు..

Rythu Bandhu Scheme | వానాకాలం మొదలైంది. వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది వానాకాలం పంటకు సంబంధించి సాయం అందించేందుకు సిద్ధమైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం డబ్బులను జమ చేయనున్నట్లు […]

  • Publish Date - June 25, 2023 / 11:14 AM IST

Rythu Bandhu Scheme | వానాకాలం మొదలైంది. వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది వానాకాలం పంటకు సంబంధించి సాయం అందించేందుకు సిద్ధమైంది.

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పంటకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

ఈ సారి కొత్తగా 1.5లక్షల మంది పోడురైతులకు సైతం రైతుబంధు పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.రూ.7720.29కోట్లు జమవుతాయని చెప్పారు. 1.54కోట్ల ఎకరాలకు అందతున్న రైతుబంధు సాయం అందించనున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా.. గత సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 68.94 లక్షలు మందికి రైతుబంధు అందించింది.

1.53 కోట్ల ఎకరాల సాగుకు రూ.7,654.43 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, ఈ సారి రైతుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం ఈ నెల 30 నుంచి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది నుంచే పోడు రైతులకు సైతం రైతుబంధు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో రూ.58,102 కోట్ల జమ చేసింది.