Site icon vidhaatha

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు..!

విధాత‌: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమలకు వెళ్లేందుకు అయ్యప్పస్వామి భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాచిగూడ -కొల్లం (07109)కు ఈ నెల 18, 25, జనవరి 1, 8, 15 తేదీల్లో ప్రత్యేక రైలును నడిపించనున్నట్లు పేర్కొంది. ఈ రైలు ప్రతి సోమవారం రాత్రి 11.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి బుధవారం రోజున ఉదయం 5.30 గంటలకు కొల్లం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే కొల్లం-కాచిగూడ (07110) ప్రత్యేక రైలును ఈ నెల 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో నడువనున్నది. రైలు ప్రతి బుధవారం కొల్లం రైల్వేస్టేషన్‌ నుంచి ఉదయం 10.45 గంటలకు బయలుదేరి గురువారం రోజున కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది.


రైలు రెండుమార్గాల్లో ఉమ్దానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, శ్రీరాంనగర్‌, గద్వాల, కర్నూల్‌ సిటీ, డోన్‌, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పడి, జోలార్‌పెట్టై, సలేమ్‌, ఈ రోడ్‌, త్రిరుప్పూర్‌‌, పొదనూర్‌, పాల్ఘట్‌, త్రిసూర్‌, అలువా, ఎర్నాకులం టౌన్‌, కొట్టాయం, చంగానస్సేరి, తిరువల్ల, చెంగాన్నూర్‌, మవేలిక్కర, కాయంకులం స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఆయా రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Exit mobile version