IRCTC Jyotirlinga Darshan | జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా..! ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీకోసమే మరి..!

IRCTC Jyotirlinga Darshan | వేసవి సెలవులు వచ్చేశాయి. దాంతో చాలామంది పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారు. మరికొందరు తీర్థయాత్రలకు ప్లాన్‌ చేస్తుంటారు. ఆలయాల దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న వారి కోసం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ ప్రదేశాలను దర్శించేందుకు ఈ ప్యాకేజీని రన్‌ చేస్తున్నది. ఈ ప్యాకేజీలో ప్రయాణం హైదరాబాద్‌లో మొదలవుతుంది.

  • Publish Date - April 24, 2024 / 11:15 AM IST

IRCTC Jyotirlinga Darshan | వేసవి సెలవులు వచ్చేశాయి. దాంతో చాలామంది పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారు. మరికొందరు తీర్థయాత్రలకు ప్లాన్‌ చేస్తుంటారు. ఆలయాల దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న వారి కోసం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ ప్రదేశాలను దర్శించేందుకు ఈ ప్యాకేజీని రన్‌ చేస్తున్నది. ఈ ప్యాకేజీలో ప్రయాణం హైదరాబాద్‌లో మొదలవుతుంది. కేవలం రూ.11,720 ప్రారంభ ధరతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో మధ్యప్రదేశ్‌లో ఉన్న భోపాల్‌, ఓంకారేశ్వర్‌, సాంచి, ఉజ్జయిని తదితర జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. ఈ ప్యాకేజీ ‘మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ దర్శన్‌’ పేరుతో తీసుకురాగా.. ఇందులో ఐదురోజుల పాటు ప్రయాణం కొనసాగుతుంది.

పర్యటన సాగుతుందిలా..

ప్యాకేజీలో ప్రస్తుతం మే ఒకటి నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఐదురోజుల పాటు కొనసాగే ప్యాకేజీలో తొలిరోజు ప్రయాణం మే ఒకటిన బుధవారం ప్రయాణం మొదలవుతుంది. తొలిరోజు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సాయంత్రం 4.40 గంటలకు సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ (12707) రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా రైలులోనే ప్రయాణం ఉంటుంది. రెండోరోజు ఉదయం 8.15 గంటలకు భోపాల్‌ చేరుకుంటారు. స్టేషన్‌ నుంచి హోటల్‌కి వెళ్తారు. అనంతరం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంచి స్థూపం సందర్శనకు బయలుదేరి వెళ్తారు. తర్వాత భోజేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శిస్తారు. తిరిగి భోపాల్‌ చేరుకొని గిరిజన మ్యూజియాన్ని చూస్తారు. రాత్రి భోపాల్‌లోనే బస ఉంటుంది. మూడోరోజు ఉదయం అల్పహారం పూర్తి చేసుకొని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయినికి బయలుదేరి వెళ్తారు.

ఉజ్జయినికిలో హోటల్‌కు వెళ్లి రెడీ అయ్యాక స్థానికంగా ఉన్న మహాకాళేశ్వర్‌ ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళ్‌నాథ్‌ ఆలయం, నవగ్రహ శని మందిరం, చింతామన్ గణేశ్‌ ఆలయం, రామ్ ఘాట్, గఢ్‌ కాళికా ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి ఉజ్జయిలోనే బస ఉంటుంది. నాలుగో రోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని 165కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్వర్‌కు బయలుదేరి వెళ్తారు. అక్కడ అహల్యా దేవి కోట, నర్మదా ఘాట్ సందర్శిం.. ఓంకారేశ్వర్‌కు బయలుదేరతారు. అక్కడ హోటల్‌కు చేరుకొని ఓంకారేశ్వర్ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తారు. రాత్రి బస అక్కడే ఉంటుంది. ఐదోరోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని ఇండోర్‌ బయలుదేరి వెళ్తారు. అక్కడ లాల్ బాగ్ ప్యాలెస్, ఖజ్రానా గణేశ్‌ మందిరాన్ని వీక్షిస్తారు. రాత్రి 8గంటలకు ఇండోర్ రైల్వే స్టేషన్‌కి చేరుకొని 19301 రైలులో తిరుగు ప్రయాణమవుతారు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు ఇవే..

మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ దర్శన్‌ ప్యాకేజీలో రెండురకాల ప్యాకేజీలున్నాయి. కంఫర్ట్‌ కేటగిరిలో థర్డ్‌ ఏసీ ప్రయాణముంటుంది. స్టాండర్డ్‌ క్లాస్‌లో స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ షేరింగ్‌కు రూ.35,800 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్‌ షేరింగ్‌కు రూ.20,180 చెల్లిస్తే సరిపోతుంది. ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.15,750 చెల్లించాలి. 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.11,910.. బెడ్‌ అవసరం లేదనుకుంటే రూ.10,020 చెల్లించాలి. స్టాండర్డ్ క్లాస్‌లో సింగిల్‌ షేరింగ్‌కు రూ.33,390.. డబుల్ షేరింగ్‌కు రూ.17,700, ట్రిబుల్ షేరింగ్ రూ.13,260 చెల్లించాల్సి ఉంటుంది. నలుగురి నుంచి ఆరుగురు కలిపి బుక్‌ చేసుకుంటే కంఫర్ట్‌ కేటగిరిలో ట్విన్‌ షేరింగ్‌కు ఒక్కొక్కరు రూ.16,580, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.14,210 చెల్లించాలి. స్టాండర్డ్‌ క్లాస్‌లో ట్విన్‌ షేరింగ్‌కు రూ.14,100.. ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.11,720 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ వివరించింది. పూర్తి వివరాలకు irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.

Latest News