IRCTC Best Package | మిస్టికల్ కశ్మీర్ న్యూ ఇయర్ స్పెషల్ ట్రిప్.. 35550 మాత్రమే

వేసవి కాలంలో ఎవరైనా చల్లటి ప్రదేశాలకు వెళతారు. కానీ.. చలికాలంలో చలి ప్రదేశాలకు వెళితే ఆ థ్రిల్లే వేరు. అందునా హిమాలయాల అందాలు ఆస్వాదించే కశ్మీర్‌ టూర్‌ అంటే చెప్పాల్సిన పనిలేదు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కశ్మీర్ న్యూ ఇయర్ స్పెషల్ ట్రిప్‌ ప్లాన్‌ చేసింది.

IRCTC Best Package | కశ్మీర్ అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది చాల లోతైన పచ్చని లోయలు, మంచు శిఖరాలు, అందమైన మొఘల్ గార్డెన్స్, దాల్ సరస్సులో హౌజ్ బోట్‌, షికరా రైడ్లు, గుల్‌మార్గ్, పహల్గామ్, సోన్ మార్గ్ వంటి కనువిందు చేసే ఎంతో సుందరమైన ప్రదేశాలు, శీతాకాలంలో మంచు అందాలు, పశ్మీనా శాలువలు, సంప్రదాయ కళా ఖండాలు. ఇన్ని అందాలు ఉన్న కశ్మీర్‌ను భూతల స్వర్గం అంటారు. అలాంటి ప్రదేశాన్ని చూపించేందుకు నూతన సంవత్సర సందర్భంగా IRCTC రూ.35550కే బెస్ట్ ప్యాకేజీని తీసుకు వచ్చింది.

యాత్ర పూర్తి వివరాలు చూసుకున్నట్లైతే… ఈ నెల 29 ప్రారంభం అవుతుంది. 29వ తేదీన ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్‌ నంబర్ 6E-495/6288 నుంచి శ్రీనగర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌కు చేరుకుంటారు. సాయంకాలం శ్రీనగర్‌లో గడిపి రాత్రికి హోటల్‌లో బస చేస్తారు.

మరుసటి రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసి సోన్ మార్గ్ బయలుదేరుతారు. సోన్ మార్గ్.. సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మంచు కొండలపై అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. సింధూ నది ఇక్కడ వంపులు తిరుగుతూ ప్రవహిస్తూ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అది చూసిన తర్వాత తిరిగి సాయంత్రం శ్రీనగర్ హోటల్ చేరుకుంటారు.

మూడవ రోజు ఉదయం అల్పాహారం ముగిశాక గుల్‌మార్గ్‌ బయలు దేరుతారు. రోడ్లంతా అందమైన పూవులతో కనువిందు చేస్తాయి. ఇక్కడ గోండోలా రైడ్‌‌ను ప్రయాణికులు సొంతంగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గుల్‌మార్గ్‌ చూశాక తరిగి హోటల్ చేరుకుంటారు.

మరుసటి రోజు యథావిధిగా బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేసి, పహల్గామ్ బయలు దేరుతారు. ఇది సముద్ర మట్టానికి 2440 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించేట్టప్పడు చూట్టూ కుంకుమ పూల వ్యవసాయ క్షేత్రాలు, అవంతిపూర్ శిథిలాలు కనువిందు చేస్తాయి. భారత చలన చిత్రాలు పహల్గామ్ ఎంతో పేరుగాంచిన ప్రదేశం. బతీబ్ వ్యాలీ, చందన్ వారీ, అరు వ్యాలీలో పకృతి సౌందర్యమైన లోయలు మంత్రముగ్ధులను చేస్తాయి. జీవితంలో ఒక్క సారైనా పహల్గామ్ చూడాల్సిన ప్రదేశం. సాయంత్రం పహల్గామ్‌లోనే హోటల్‌లో బస చేస్తారు.

ఐదవ రోజు ఉదయం టిఫిన్ గట్రా ముగించేసుకుని శ్రీనగర్ బయలుదేరుతారు. శ్రీనగర్‌లో ఎంతో ప్రత్యేకమైన శంకరాచార్య ఆలయం దర్శించుకుంటారు. ఆ రోజు సాయంకాలం దాల్ లేక్ వైపు శిఖర రైడింగ్ వెళ్తారు. అక్కడ సన్ సెట్, చార్ చినార్(తేలి ఆడే ఉద్యాన వనాలు) ఎంజాయ్ చేయవచ్చు. సాయంత్రం హౌస్ బోట్‌లో చెకిన్ అవుతారు. రాత్రికి డిన్నర్, బస అందులోనే.

ఇక చివరగా ఆరవ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని మొగల్ గార్డెన్స్ సందర్శిస్తారు. బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ చూసి శ్రీనగర్ ఎయిర్ పోర్ట్‌ చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 2:55 గంటలకు 6E-044/6617 ఫ్లైట్ ఎక్కి రాత్రి 8:30 గంటకు హైదరాబాద్ చేరుకోవడంతో ట్రిప్‌ ముగుస్తుంది.

టికెట్ ధరలు: ఈ యాత్రకు ఒక్కరు మాత్రమే వెళ్తే రూ. 47100 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరు రూ.36950, అదే ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్కరూ రూ.35550 చెల్లించాలి. 5నుంచి 11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు అయితే బెడ్‌తో అయితే రూ.30050, వితౌట్ బెడ్ అయితే రూ,27450 చెల్లించాలి. అదే 2 నుంచి 4 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకైతే రూ.21400 చెల్లించాలి.

నోట్ : పూర్తి వివరాల కోసం IRCTC వెబ్ సైట్‌ను సందర్శించగలరు.

Read Also |

World’s Busiest Airports : అత్యంత రద్దీ ఏయిర్ పోర్టులలో…న్యూఢిల్లీకి ఏడో స్థానం
Future City : ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ సమ్మిట్ ఊపు… రియల్ ఎస్టేట్ జోరందుకుంటుందా?
Grape Cultivation | సిరులు కురిపిస్తున్న ద్రాక్ష సాగు.. ఏడాదికి రూ. 75 ల‌క్ష‌లు సంపాదిస్తున్న యువ రైతు

Latest News