Site icon vidhaatha

స‌లార్ రిలీజ్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

విధాత‌: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న స‌లార్ సెకండ్ ట్రైల‌ర్ విడుద‌లైంది. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత నుండి అన్ని పెద్ద చిత్రాలే చేశాడు. సాహో చిత్రం హిందీలో అల‌రించిన తెలుగులో మాత్రం నిరాశ‌ప‌ర‌చింది. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌` డిజప్పాయింట్‌ చేశాయి. వ‌రుస ఫ్లాపులు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. ఇప్పుడు అంద‌రి దృష్టి స‌లార్ మూవీపైనే ఉంది.


స‌లార్ ట్రైల‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇందులో ప్ర‌భాస్‌ని స‌రిగా చూపించ‌నందుకు ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు. ఇక సెకండ్ ట్రైల‌ర్ కోసం చాలా రోజుల నుండి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌శాంత్ నీల్ సినిమా అంటే ఇందులో భారీ ఎలివేషన్లు, విరోచితమైన యాక్షన్‌ ఎపిసోడ్లు, భారీ డైలాగులు ఉంటాయని అనుకోగా, అవేవి ట్రైల‌ర్‌లో క‌నిపించ‌లేద‌ని ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. ప్రభాస్‌ డైలాగ్‌ డెలివరీపై కూడా తీవ్ర అసంతృప్తి ఎదురవుతుంది. ప్రభాస్‌ డైలాగ్‌లో అంత ఈజ్ లేక‌పోగా, పవర్‌ ఫుల్‌ డైలాగ్‌లు కూడా క‌నిపించ‌లేద‌ని, ప్ర‌భాస్‌ని కూడా అంత స్ట్రాంగ్‌గా చూపించ‌లేద‌ని అంటున్నారు.

Exit mobile version