Samantha |
విధాత: సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ‘ఖుషి’ మూవీ రీసెంట్‌గా రిలీజై.. కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఇంకా అనుకున్న విధంగా విజయాన్ని అందుకున్నట్టుగా కనిపించడం లేదు. ఒక్కోచోట ఒక్కోలా రెస్పాన్స్ ఉండటంతో ఈ మూవీకి మరికొంత ప్రమోషన్స్, ఫోకస్ అవసరం అనుకుంటున్నారట చిత్ర టీమ్.
అయితే మూవీ పూర్తి కాగానే, తిరిగి అమెరికాకు వెళ్లిపోయి, అటునుంచి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సెర్ట్‌లో మాత్రమే పాల్గొని ఏదో వచ్చాననిపించింది సమంత. దానికి ఆమె అనారోగ్యం మయోసైటిస్ పెద్ద కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే.
అయితే, ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండతో వేసిన స్టెప్స్, మూవ్స్ కాస్త వైరల్‌గా మారి ఇద్దరి జోడీపై రక రకాలుగా మాట్లాడుకునేలా చేశాయి. ఇది ఓ రకంగా సినిమాకు ఫ్లస్ అయిందనే చెప్పాలి.
అయితే పూర్తిగా మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికాలో మూడు నెలల పాటు ఉండాలనుకున్న సమంత ఉన్నట్టుండి అమెరికా నుంచి హైదరాబాద్ ప్రయాణం కట్టిందట. దీంతో ఆమె అంత సడెన్‌గా ఎందుకూడి పడినట్లు అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు.
ఆమె రాకకు కారణం ‘ఖుషి’ సినిమా అని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఇంకా కలెక్షన్స్ పరంగా బ్రేకివెన్ కావడానికి ఇంకా రూ. 20 కోట్లకు పైనే రాబట్టాలట.
దాని కోసం చిత్రబృదం ఎంత ప్రమోట్ చేసినా విజయ్ ఎంత సహకరించినా ఇంకా ప్రమోట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. దీనికి తోడు విజయ్ దేవరకొండకి, సమంతకూ ఇద్దరికీ ఖుషి హిట్ టాక్ తెచ్చుకోవడం, అలాగే కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోవడం ఇప్పుడు చాలా అవసరం.
ఈ ఇద్దరికీ చాలా కాలంగా ఒక్క హిట్ కూడా లేదు. ఇద్దరూ ఈ మూవీ మీదనే హోప్స్ పెట్టుకున్నారు. విజయ్ ఎంత ఒంటి రెక్కతో ప్రమోషన్స్ తంతు లాక్కొచ్చినా పని కాలేకపోయే సరికి రంగంలోకి సమంతనే దిగాల్సి వచ్చిందనేలా టాక్ నడుస్తుంది. అందుకే సమంతని ఉన్నపళంగా అమెరికా నుంచి మైత్రీ వారు రప్పించారని అంటున్నారు.
మొదటి వీకెండ్‌లో ఖుషి మంచి ఓపెనింగ్స్ అందుకుంది కానీ ఆ తర్వాత సోమ, మంగళ, బుధవారాలు కలెక్షన్స్ అంతగా అయితే లేవు. దీంతో ఇంకా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని ఉన్న పళాన అమెరికా నుంచి సమంతని రప్పించారనే టాక్ అయితే కాస్త గట్టిగానే నడుస్తుంది.
సమంత, విజయ్ కలిస్తే మొన్నటి మ్యూజిక్ కాన్సెర్ట్ లోలా మరింత రెచ్చిపోయి సినిమా ప్రమోషన్స్ మరో స్థాయిలో ఉంటాయని కాబోలు ఇంత స్కెచ్ వేశారు. అందుకోసమేనేమో.. అటు సమంత కూడా నష్టాల నుంచి ఎలాగన్నా మూవీని గట్టున పడేయాలనే ఉద్దేశ్యంతోనే హుటాహుటిన బయలుదేరివచ్చింది.
అయితే ఈ వారం వచ్చిన ‘జవాన్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలు మంచి టాక్‌ని తెచ్చుకోవడంతో.. ‘ఖుషి’పై తాటకాయ పడ్డట్టయింది. మరి ఇలాంటి సిచ్యుయేషన్ నుంచి ‘ఖుషి’ని విజయ్, సమంతలు ఎలా గట్టెక్కిస్తారో చూడాల్సి ఉంది.