Samantha |
సమంత ఈ మధ్య కాలంలో సింపతీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తున్నా.. నిజంగా తను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతుందనే విషయంలో క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఈ వ్యాధి ఏమోగానీ.. సమంతని గ్లామర్‌గా చూసి చాలా కాలం అవుతుంది. అంటే సోషల్ మీడియాలో ఆమె పొట్టి దుస్తుల్లో కనిపించినా కూడా ఆమెలోని స్పార్క్ మాత్రం ఆమె అభిమానులు కూడా మిస్సవుతూ వస్తున్నారు.
కానీ చాలా కాలం తర్వాత వావ్.. ఏముందిరా సమంత అనుకునేలా.. తాజాగా ఓ పిక్ బయటికి వచ్చింది. ఈ పిక్‌లో సమంతని చూసిన వారంతా.. చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆమెని ఈ మధ్య కాలంలో ఇలా అయితే చూడలేదనేలా కామెంట్స్ చేస్తున్నారంటే.. ఈ పిక్‌లో ఆమె ఎంత అందంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పిక్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా లోనిది ఈ స్టిల్. శివ నిర్వాణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోన్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఎప్పుడో ప్రమోషన్స్ మొదలెట్టారు. ఆ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన సాంగ్స్ అన్నీ పెద్ద హిట్టయ్యాయి. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు ట్రైలర్ టైమ్ వచ్చేసింది.
ఆగస్ట్ 9న ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ.. పై పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ ఒడిలో సమంత కూర్చుని ఉంది. ఇద్దరూ ప్రేమ పాఠాలలో మునిగిపోయారు. సమంత చేతిలో కాఫీ కప్, ఎదురుగా పెట్ డాగ్ ఉండగా.. ఇద్దరూ ముద్దులాటకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.
అయితే ఈ స్టిల్‌ని, ఇందులో సమంతని చూసిన వారు మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. చాలా కాలం తర్వాత గ్లామరస్ సమంతని చూడబోతున్నామనేదానికి హింట్ ఇచ్చినట్లుగా ఈ పిక్ ఉందని.. సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నామనేలా.. నెటిజన్లు, సమంత అభిమానులు ఈ పిక్‌పై కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.