Sanjay Dutt | బాలీవుడ్‌ Vs సౌత్‌ సినిమాపై సంజయ్‌ దత్‌ కీలక వ్యాఖ్యలు..!

Sanjay Dutt | సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌తో పాటు పలు భారతీయ సినిమాల్లోనూ నటించి తనదైన ముద్రను వేశాడు. ఇటీవల కేజీఎఫ్‌-2తో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సినిమాలో సంజయ్‌ దత్‌ పాత్రకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్‌ దత్‌.. బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ డిబేట్‌పై ప్రశ్నలు సంధించగా.. కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఈ విషయంపై సంజయ్‌ […]

  • Publish Date - March 8, 2023 / 12:25 PM IST

Sanjay Dutt | సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌తో పాటు పలు భారతీయ సినిమాల్లోనూ నటించి తనదైన ముద్రను వేశాడు. ఇటీవల కేజీఎఫ్‌-2తో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సినిమాలో సంజయ్‌ దత్‌ పాత్రకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది.

అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్‌ దత్‌.. బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ డిబేట్‌పై ప్రశ్నలు సంధించగా.. కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఈ విషయంపై సంజయ్‌ దత్‌ స్పందిస్తూ.. బాలీవుడ్‌, సౌత్‌ అంటూ సినిమాలను వేరు చేయడం సరికాదన్నాడు. తాను సౌత్‌, బాలీవుడ్‌, నార్త్‌, ఈస్ట్‌ సినిమా అంటూ ఏమీ చూడనని చెప్పాడు.

దేశంలో తీసిన ప్రతి సినిమా.. భారతీయ సినిమానేనని తెలిపాడు. అలానే ఉండాలని, మేమంతా అందులో భాగమేనని, ఒకే దేశం.. ఒకటే జట్టు అని, సినిమాను వేరు చేయడం సరికాదన్నాడు. సినిమా పరిశ్రమ మొత్తం ఒకే పెద్ద కుటుంబం, ఇది భారతీయ సినిమాకు మంచి విషయమని, మేమం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని.. సౌత్‌, ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌ ఇలాంటివి విశ్వసించొద్దని, అంతా ఒకే కుటుంబమని చెప్పుడుకొచ్చాడు సంజయ్‌ దత్‌.

సినిమాల డెవలప్‌మెంట్‌ స్పందిస్తూ.. ఒకప్పుడు మన దగ్గర పేపర్‌ ఉండేదని, సినిమాపై సంతకం చేసే సమయం ఉండేదని, చాలా అభద్రతాభావం, ఆర్థిక నష్టాలుండేవని తెలిపాడు. కానీ, ఇప్పుడు అలా కాదని, ఇప్పుడు సరైన ఛానెల్‌ తయారు చేయబడిందని, ప్రతిదీ డాక్యుమెంట్‌ చేస్తున్నారని, ఇంతకు మునుపు కెమెరా ముందుకు వెళ్లే ముందు స్క్రిప్ట్‌ని ఇచ్చే వారని.. కానీ ఇప్పుడు అంతా ముందే సిద్ధంగా ఉంటుందని, సంబంధిత పాత్రను పోషించేందుకు ప్రాక్టీస్‌ సెషన్‌లు ఉంటున్నాయని దత్‌ చెప్పాడు.

ప్రస్తుతం సినిమాల్లో వినియోగిస్తున్న సాంకేతిక విధానంపై సైతం సంతోషం వ్యక్తం చేశాడు. టెక్నాలజీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దని సూచించారు. ఎందుకంటే ఇదే భవిష్యత్‌ అన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌, పఠాన్‌ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధించడం సంతోషంగా ఉందన్న దత్‌.. ఇలాంటి గొప్ప సినిమాలు ఇంకా రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతి కళాకారుడికి గొప్ప పాత్రలు వస్తున్నాయని, ప్రతిభావంతులైన వారికి అనేక అవకాశాలున్నాయన్నాడు. ఇదిలా ఉండగా.. సంజయ్‌ దత్‌ త్వరలో ‘హేరా ఫేరి’ చిత్రంలో కనిపించనున్నాడు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, సునీల్ శెట్టి, రవికిష‌న్‌తో కలిసి మరోసారి నవ్వించబోతున్నాడు.

Latest News