Ananya Panday| యశ్ తో నటించాలనుంది : అనన్య పాండే

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సినిమాల కంటే తన గ్లామర్ తో సోషల్ మీడియాలో చేసే హడావుడి అంతా ఇంతకాదు. తాజాగా ‘కేజీఎఫ్‌’ తో స్టార్ హీరోగా మారిన కన్నడ హీరో యశ్‌ పక్కన నటించాలని ఉందని అనన్య తన అనంత కోరికల చిట్టాను విప్పింది.

విధాత : బాలీవుడ్(Bollywood) బ్యూటీ అనన్య పాండే(Ananya Panday)  సినిమాలలో కంటే తన గ్లామర్ తో సోషల్ మీడియాలో చేసే హడావుడి అంతా ఇంతకాదు. బాలీవుడు నటుడు చుంకీ పాండే కుమార్తెగా 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన అనన్య పాండే తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం తు మేరీ మైన్ తేరా మేన్ తేరా తు మేరీ సినిమాలో నటిస్తుంది.

గతంలో సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో ఛాన్స్‌ రావాలని కోరుకుంటున్నాని చెప్పిన ఈ భామ రొమాంటిక్‌, హారర్‌, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలనుందని కూడా చెప్పింది. తాజాగా ‘కేజీఎఫ్‌’ తో స్టార్ హీరోగా మారిన కన్నడ హీరో యశ్‌(Yash) పక్కన నటించాలని ఉందని అనన్య తన అనంత కోరికల చిట్టాను విప్పింది. ప్రస్తుతం యశ్ ‘టాక్సిక్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. దీనితోపాటు నితీశ్‌ తివారీ రూపొందిస్తోన్న హిందీ ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తూ.. నటిస్తున్నారు.