Site icon vidhaatha

Nalgonda | అయిటిపాముల SBI ఏటీఎంలో.. 23లక్షలు చోరీ

Nalgonda

విధాత: నల్లగొండ జిల్లా అయిటిపాములలో ఎస్‌బీఐ ఏటిఎంను దొంగలు కొల్లగొట్టారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్ చేసి మరి 23లక్షల రూపాయలను దోచుకెళ్లారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ టీవీ ఫుటేజిలో దొంగలు తమ ముఖాలు కనిపించకుండా బట్ట కట్టుకున్నారు. వీడియోలో ఇద్దరు దొంగలు మాత్రం కనిపిస్తున్నారు. క్లూస్ టీమ్‌లు రంగంలోకి దిగి దొంగలను గుర్తించి పట్టుకునే పనిలో పడ్డారు.

Exit mobile version