విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ పట్టణంలోని మైనార్టీ భవన్ లో శనివారం ప్రతిభా ఈబీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పంపిణీ చేశారు. ప్రముఖ సామాజికవేత్త ఏచూరి భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై స్కాలర్ షిప్ లు పంపిణీచేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇదార ఏ ఇకామత్ఖాన బహదూర్ ఖానా ఆధ్వర్యంలో 177 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ లు అందజేయడం అభినందనీయమన్నారు. ఏ మతం విద్యార్థులైనా చదివితేనే అభివృద్ధి చెందుతారని, ప్రతిఒక్కరు విద్యపై దృష్టి సారించాలని కోరారు. మైనార్టీల సంక్షేమం కోసం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్రతి ఒక్కరు ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. విద్యార్థులను విద్య వైపు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జాహెడ్ హుస్సేన్, ఖురేషి, అహ్మద్ ఖలిం, రాజియోద్దీన్, ఖలిం, జఫీజ్, షాహిద్, గులాం జిలానీ పాల్గొన్నారు.