ఏపీ రైలు ప్రయాణికులకు అలెర్ట్‌.. మరికొన్ని ట్రైన్లను రద్దు చేసిన అధికారులు

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్‌ను జారీ చేసింది. మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. విజయవాడ డివిజన్‌లో భద్రతా పనులు జరుగుతున్నాయి.

  • Publish Date - November 25, 2023 / 05:57 AM IST

విధాత‌: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్‌ను జారీ చేసింది. మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. విజయవాడ డివిజన్‌లో భద్రతా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే డివిజన్‌లో భారీగా రైళ్లను అధికారులు రద్దు చేశారు. తాజాగా నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు – విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, మచిలీపట్నం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 4 మధ్య రైళ్లు రద్దు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌ 27, 28, 29, డిసెంబర్‌ 1, 2 తేదీల్లో విజయవాడ-విశాఖ రైలు, విశాఖ-విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు అవుతాయని పేర్కొన్నారు. పనులు పూర్తయ్యాక తిరిగి యథావిధిగా రైళ్లు నడుస్తాయని వివరించారు.