విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ ఆల్ సీనియర్స్ సిటిజెన్ ఆరవ వార్షికోత్సవం పురస్కరించుకుని జిల్లాలో సేవలందిస్తున్న సీనియర్ సిటీజన్లను, తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్న పలువురిని శనివారం సన్మానించారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సిటీజన్, విశ్రాంత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మంగ శంకర్ గౌడ్, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జగదీష్ చంద్ర, విశ్రాంత ఉపాధ్యాయులు కృష్ణమూర్తి లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంఘం అధ్యక్షులు నర్సింహారావు సన్మానించారు.
వీరితో పాటు తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్న మెదక్ కు చెందిన సూరజ్ దీయాల్, గంట సంపత్, నిరుడి జోసఫ్ లను కూడా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు అరుణ్ దయరాజ్ పాల్గొన్నారు.