Singer Cardi B
విధాత: తనను చికాకు పరిచిన వ్యక్తుల పైకి ఇటీవల ఓ గాయని మైక్‌ను విసిరియేగా.. తాజాగా జరిగిన ఓ వేలంలో ఆ మైక్ రికార్డు స్థాయి ధర వద్ద ట్రేడవుతోంది. జులై 24న అమెరికా (America) లోని డ్రయాస్ బీచ్ క్లబ్‌లో జరిగిన ఒక సంగీత విభావరిలో ప్రఖ్యాత ర్యాప్ సింగర్ కార్డీ బీ పాల్గొంది.
ఆమె తన్మయత్వంలో మునిగిపోయి హుషారెత్తించే పాట పాడుతుండగా.. కింద ఉన్న సందర్శకుల్లో ఒకరు కార్డీ బీ పై డ్రింక్‌ను విసిరారు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చి చేతిలోని మైక్‌ను ఆ డ్రింక్ విసిరిన వారి పైకి గట్టిగా విసిరేసింది.
A new video shows #Cardi B telling fans to splash water at her. pic.twitter.com/tj8RnBFRKY
— Juice Pop (@TheJuicePop) July 30, 2023
ద ష్యూర్ ఆక్సియెంట్ డిజిటల్ శ్రేణికి చెందిన ఆ మైక్‌ను సంబంధిత ఆడియో కంపెనీ ద వేవ్ వేలానికి పెట్టింది. ఈ బే వెబ్‌సైట్‌లో దీనిని వేలానికి పెట్టి కార్డీ బీ విసిరేసిన మైక్ ఇదేనని పేర్కొంది. ప్రస్తుతం వేలం కొనసాగుతుండగా.. గురువారానికి దాని విలువ రూ.82 లక్షలుగా చూపిస్తోంది.
వేలం పూర్తయిన తర్వాత వచ్చే మొత్తాన్నిరెండు స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తానని ఆడియో కంపెనీ అధినేత ఫిషర్ వెల్లడించాడు. మరోవైపు ఆ మైక్.. జ్యూస్ విసిరిన వ్యక్తినే కాకుండా తనను కూడా గాయపరిచిందని ఓ యువతి లాస్‌వేగస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.