Site icon vidhaatha

Nara Lokesh: భవిష్యత్తు కోసం ఆరు శాసనాలు : నారా లోకేష్

అమరావతి : టీడీపీ అంటేనే పేదల పార్టీ అని.. తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని.. మనకు ప్రతిపక్షం కొత్త కాదని..అధికారం కొత్త కాదని.. పార్టీ..రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లారా లోకేష్ కడప మహానాడు వేదికగా ప్రకటించాంచారు. 1.తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2.యువగళం, 3. స్త్రీ శక్తి, 4. పేదల సేవల్లో సోషల్‌ రీఇంజనీరింగ్‌, 5. అన్నదాతకు అండ, 6.కార్యకర్తే అధినేత అనే ఆరు శాసనాలను పార్టీ శ్రేణులు పాటించాలన్నారను. సమాజంలో మహిళలను చులకనగా చూసే పరిస్థితి మారిపోవాలన్నారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారన్నారు. తల్లుల్ని అవమానిస్తే, చెల్లెల్ని గెంటేస్తే ..ఏమవుతుందో! అర్థమైందా రాజా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం పార్టీ సిద్ధాంతం’’ అని లోకేశ్‌ తెలిపారు.

మారుతున్న కాలానికి తగినట్లుగా పార్టీ కూడా మారాలన్నారు. అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలని… పని చేసేవారిని ప్రోత్సహిస్తామని లోకేష్ తెలిపారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని.. ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌.. పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిదన్నారు. తెలుగు వాళ్లు ఎక్కడ ఇబ్బంది పడినా స్పందించేది మన పార్టీనే అని గుర్తు చేశారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఎప్పటికప్పుడు నేతలు, కార్యకర్తలు కష్టపడాల్సిందేనని..అందుకు ప్రణాళికలు సిద్ధం చేసి.. మహానాడులో చర్చించి నిర్ణయాలు తీసుకుందామని తెలిపారు. 58 మంది మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16347 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారన్నారు.

Exit mobile version