ఆరేళ్ల చిన్నారికి గుండెపోటు.. చికిత్స అందించాక..

గుండెపోటు అనేది ఒక వయసు దాటాక వస్తుందనేది గతంలో అభిప్రాయం ఉండేది. కొవిడ్‌ తర్వాత పూర్తి ఆరోగ్యవంతులు సైతం గుండెపోటుకు గురైన వార్తలు చూశాం.

  • Publish Date - November 27, 2023 / 12:22 PM IST

న్యూఢిల్లీ: గుండెపోటు అనేది ఒక వయసు దాటాక వస్తుందనేది గతంలో అభిప్రాయం ఉండేది. కొవిడ్‌ తర్వాత పూర్తి ఆరోగ్యవంతులు సైతం గుండెపోటుకు గురైన వార్తలు చూశాం. వాటి సంగతెలా ఉన్నా.. చిన్నారులు సైతం గుండెపోటుకు గురై మరణించడం విషాదాన్ని రేకెత్తిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో బంధువుల పెళ్ళికి వచ్చిన ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో చనిపోయింది. మధ్యప్రదేశ్ కు చెందిన విహాన్ జైన్(6) తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలోని బంధువుల పెళ్లి వేడుకకు వచ్చాడు. సోమవారం బంధువులంతా పెళ్లి వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు.


ఈ క్రమంలో విహాన్ సడన్ గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. కానీ.. అక్కడ చికిత్స పొందుతూ విహాన్ మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా విహాన్ మయోకార్టీటిస్ (గుండె కండరాల వాపు) వల్ల చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. దీనివల్ల హృదయ నాళాల్లో గడ్డలు ఏర్పడి శరీరానికి రక్త సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా గుండెపోటు వస్తుందని వైద్యులు తెలిపారు. విహాన్‌కు ఇదే పరిస్థితి ఎదురైందని వెల్లడించారు.


ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు సంఖ్య పెరిగిపోతుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్ కు బలవుతున్నారు ఒకప్పుడు 60 పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి. కానీ ప్రస్తుత కాలంలో గుండెపోటు వ్యాధులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. వీటికి ఆరోగ్య సమస్యలు ఒక కారణమైతే, మానసిక ఒత్తిడి ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమంటున్నారు వైద్యలు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి రోజూ ధ్యానం, యోగా వంటి శారీరక శ్రమకల్గించే పనులు చేయాలని సూచిస్తున్నారు.