IND vs SL
విధాత: ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక జట్టు 15.2ఓవర్లలో 50పరుగులకే కుప్పకూలింది. భారత్ ముందు కేవలం 51 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంచింది. అసియా కప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టుకు హైద్రాబాద్ పేసర్ సిరాజ్ రూపంలో ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
బూమ్రా తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టగా, సిరాజ్ ఒక ఒవర్‌లోనే నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు తీసుకుని లంక్ టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చాడు. దీంతో శ్రీలంక జట్టు ఐదు ఓవర్లలోనే 12పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
లంక జట్టులోని ఆరువికెట్లను సిరాజ్ ఒక్కడే కూల్చాడు. భారత బౌలింగ్ దాడిని ప్రారంభించిన స్టార్ పేసర్ బూమ్రా తొలి ఓవర్‌లోనే వికెట్ సాధించాడు. ఇక సిరాజ్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాప్ ఆర్డర్‌ను పెవిలియన్ చేర్చాడు.
This is funny but Kuddos to him for chasing the ball