Snake Approaches Woman: నది ఒడ్డున గంగా మాతకు పూజలు చేస్తున్న మహిళ తన వద్ధకు వచ్చిన పామును మెడలో వేసుకుని నాగాభరణంగా మార్చుకున్న ఘటన వైరల్ గా మారింది. నది తీరంలో ఓ మహిళ గంగా పూజలు చేస్తున్న క్రమంలో ఆమె చెంతకు ఓ పాము వచ్చింది. పూజ నుంచి వెనుతిరిగే సమయంలో పక్కన ఉన్న పామును గమనించిన ఆ మహిళ తొలుత కొంత ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే భక్తి పారవశ్యంతో ఆ పామును మొక్కిన ఆ మహిళ..ఎలాంటి జంకు లేకుండా దానిని చేతుల్లోకి తీసుకుని ఏకంగా మెడలో నాగాభరణంగా ధరించింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో ఆ మహిళా భక్తురాలుకు మరి ఇంత మూఢ భక్తినా అని కామెంట్లు చేస్తున్నారు. అదంతా రీల్స్ మాదిరిగా ఉందని మరికొందరు.. విషరహిత నీటి పాము కావడంతోనే ఆ మహిళ దానిని మెడలో వేసుకో కల్గిందంటూ మరికొందరు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
जय शिव शंभू 🕉️ pic.twitter.com/Lh3ncGHPOY
— Anamika Thakur (@anamika943) June 15, 2025