Site icon vidhaatha

King Cobra: మ‌రి ఇలా ఉన్నారేంట్రా.. కోబ్రాతో అవేం ప‌నులురా

King Cobra | Viral

విధాత: పాములు చూస్తేనే పరుగో పరుగు అన్నట్లుగా మనుషులు వ్యవహరిస్తుంటారు. అలాంటిది ఓ వ్యక్తి పాములతో సహవాసం చేస్తూ వాటితో ప్రమాదకర విన్యాసాలు చేయడం చూస్తే ఒళ్లు జలధరించకమానదు. అతడి ప్రాంతం ఎక్కడో కాని..రకరకాల భయంకర విష సర్పాలతో అతడి విన్యాసాలు మాత్రం ప్రాణాలతో చెలగాటాన్ని తలపిస్తున్నాయి. నల్లజాతీయుడైన ఓ వ్యక్తి ఓ భయంకర కోబ్రాను మెడలో వేసుకుని అది బుసలు కొడుతు ఒళ్లంతా పాకుతుంటే ఏమి పట్టనట్లుగా ప్రశాంతంగా బ్రష్ చేసుకున్నాడు.

మరో వీడియోలో ఓ భారీ కొండచిలువను ఒంటికి చుట్టుకుని బాత్ షవర్ కింద స్నానం చేశాడు. ఇంకో వీడియోలో భారీ అనకొండను ఒంటికి చుట్టుకుని దానితో పాటు స్నానం జలకలాట సాగిస్తూ హాయిగా కాఫీ సేవించాడు. మరో వీడియోలో అత్యంత విషపూరితమైన పాముతో కాట్లు వేయించుకుని..దానికి కాట్లకు ఒంటి నుంచి రక్తం వెలువడుతున్న వీడియో ప్రదర్శించాడు.

వీటన్నింటిలో మనిషిని చిటికెలో గుటకాయ స్వాహా చేసే కొండచిలువలు.. ఒక్క కాటుతో పరలోకానికే పంపే పాములతో అతను చేసిన సాహసాలు సంచలనం కోసం..లైక్స్ కోసం చేసిన రీల్స్ వీడియోలు కనిపించాయి. ఆ వీడియోలు ఆ వ్యక్తి ఎందుకు చేసినప్పటికి అతను మాత్రం మాములు మనిషి కాదని..పాములకే కింగ్ అని పిలుస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరేమో విషం తీయబడిన పాములతో అతని విన్యాసాలు చేసి ఉండవచ్చని..అయినప్పటికి అవన్ని ప్రాణాలతో చెలగాటమేనని కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version