Site icon vidhaatha

Solar Eclipse | నేడే అరుదైన ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ సూర్యగ్రహణం..! భారత్‌లో కనిపిస్తుందా..?

Solar Eclipse | నేడు అరుదైన సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. దాదాపు 178 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతుండడం విశేషం. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే. ఇవాళ ఉదయం 8.34 గంటలకు ప్రారంభమై తెల్లవారు జామున 2.25 గంటలకంటే ముందే ముగియనున్నది. ఈ గ్రహణాన్ని ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చంద్రుడు భూమి.. సూర్యుడి మధ్యకు వెళ్లే సమయంలో సూర్యుడి దూరం సగటు కంటే ఎక్కువగా ఉండడంతో చిన్నగా కనిపిస్తాడు. ఫలితంగా బయటి భాగం మాత్రమే కనిపిస్తుంది. సూర్యుడి మధ్యలోని పూర్తి భాగాన్ని చంద్రుడు కమ్మేస్తాడు. దీన్నే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’గా.. తెలుగులో అంగుళీక సూర్యగ్రహణంగానూ పిలుస్తుంటారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ, ప్రపంచంలోని చాలా దేశాలలో ఇది కనిపిస్తుంది. అమెరికా, కెనాడా, మెక్సికో, బార్బడోస్, అర్జెంటీనా, కొలంబియా, గయానా, నికరాగ్వా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, క్యూబా, పెరూ, పరాగ్వే, ఉరుగ్వే, వెనిజులా, జమైకా, హైతీ, ఈక్వెడార్, గ్వాటెమాలా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, తదితర దేశాల్లో గ్రహణం కనిపించనున్నది.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ గ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. సర్వపితృ అమావాస్య రోజున గ్రహణం సంభవిస్తుండడం, నవరాత్రికి ముందు ఏర్పడబోతుండడంతో పలు రాశుల వారికి అదృష్టాన్ని కలుగజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. సూర్యగ్రహణం సమయంలో బుధుడు, సూర్యుడు కన్యారాశిలో ఉంటారు. అలాగే బుద్ధాదిత్య యోగం ఏర్పడుతుంది. అలాగే శనివారం ఏర్పడబోతుండగా.. శని అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజు పూర్వీకులకు తర్పణం చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని పేర్కొంటున్నారు. మేష, కర్కాటక, తుల, మకరం రాశివారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. మళ్లీ ఇలాంటి గ్రహణం 23 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నది. 

Exit mobile version