కలచివేసిన వీడియో
విధాత, హైదరాబాద్ : ఆస్తి కోసం తల్లిదండ్రులను వృద్దులని కూడా చూడకుండా అమానుషంగా దాడి చేసి చితకబాదిన కొడుకు నిర్వాకం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మదనపల్లే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరుగట్టు వారిపల్లెలో జరిగిన ఈ దారుణ ఘటన అందరిని కలిచివేసింది. సోదరుడికి భూమి ఏలా రాసిచ్చారంటూ ఓ కొడుకు తన వృద్ద తల్లిదండ్రులపై ఆవేశంగా దాడి చేసి వారిపై పిడిగుద్దులు కురిపించి కాలితో తన్ని, జుట్టు పట్టి ఈడ్చి కొట్టాడు. కొడుకు దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధులను స్థానిక టూ టౌన్ పోలీసులు ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. క్రమంగా వారు కోలుకుంటున్నారు. సోషల్ మీడియాలో దాడి వీడియో చూసిన నెటిజన్లు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.