విధాత, వరంగల్: వరంగల్ పట్టణంలోని లెనిన్ నగర్‌లో బుధవారం దారుణం జరిగింది. కన్నతల్లి కొడుకు చేతిలో హతమైంది. భార్యా భర్తల గొడవల మధ్య తల్లి తలదూరుస్తుందని, పట్టరాని కోపంతో తల్లిని కొడుకు హతమార్చిన సంఘటన జరిగింది.
భార్య భర్తలు తరచూ గొడవపడుతుండేవారు. చూస్తూ ఉండలేక సర్ది చెప్పేందుకు ప్రయత్నించేది ఆ తల్లి. గొడవల మధ్య తల్లి అడ్డు వస్తుందనే ఆవేశంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు కృష్ణ నిద్రిస్తున్నతల్లి కొమురమ్మను రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.