విధాత: తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ.. హైదరాబాద్‌కు బయలుదేరారు. ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌కు వాళ్లు చేరుకున్నారు. వీరిని శంషాబాద్ విమానాశ్రయంలో స్వయంగా రేవంత్‌రెడ్డి రిసీవ్ చేసుకోనున్నారు. హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం వీరంతాకార్యక్రమ వేదిక ఎల్బీ స్టేడియానికి రానున్నారు.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంగలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను రిసీవ్ చేసుకునేందుకు రేవంత్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. మంత్రులుగా ప్రమాణం చేయబోయే వారికి స్వయంగా రేవంత్‌రెడ్డి ఫోన్లు చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు ఇప్పటికే సూచించారు.
తెలంగాణ క్యాబినెట్
తెలంగాణ క్యాబినెట్ లో నేడు మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు మంత్రుల జాబితాను రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలు అందించారు.
ఖమ్మం : భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
వరంగల్ : సీతక్క, కొండా సురేఖ,
కరీంనగర్ : పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు
నల్లగొండ : ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,
మెదక్ : దామోదర రాజనర్సింహ్మా
మహబూబ్‌నగర్ : జూపల్లి కృష్ణారావు.