జొన్న పిండి వ‌డ‌లు.. పోష‌కాలు మెండు!

HEALTH TIP: జొన్న పిండితో రొట్టెలు చేసుకుంటార‌ని తెలుసు. మ‌రి వ‌డ‌లు ఎలా చేస్తార‌ని అనుకుంటున్నారా. చాలా సింపుల్‌గా ఆరోగ్య‌క‌ర‌మైన జొన్న పిండి వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. అందుకు కావాల్సిన ప‌దార్థాలు ఏమిటి? జొన్న‌వ‌డ‌ల్లో ఏఏ పోష‌కాలు ఉన్నాయి? అవేమిటి? ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం.. ముందుగా జొన్న పొండి వ‌డ‌ల‌కు కావాల్సిన ప‌దార్థాల గురించి తెలుసుకుందాం.. ప‌దార్థాల‌ను కొల‌త‌ల్లో ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం ఉంది. కొన్ని ప‌దార్థాల‌ను కొంత‌మంది ఎక్కువ మోతాదులో వాడుతారు. మ‌రికొంత‌మంది వేరే ప‌దార్థాల‌ను […]

  • Publish Date - February 3, 2023 / 09:38 AM IST

HEALTH TIP: జొన్న పిండితో రొట్టెలు చేసుకుంటార‌ని తెలుసు. మ‌రి వ‌డ‌లు ఎలా చేస్తార‌ని అనుకుంటున్నారా. చాలా సింపుల్‌గా ఆరోగ్య‌క‌ర‌మైన జొన్న పిండి వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. అందుకు కావాల్సిన ప‌దార్థాలు ఏమిటి? జొన్న‌వ‌డ‌ల్లో ఏఏ పోష‌కాలు ఉన్నాయి? అవేమిటి? ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం..

ముందుగా జొన్న పొండి వ‌డ‌ల‌కు కావాల్సిన ప‌దార్థాల గురించి తెలుసుకుందాం.. ప‌దార్థాల‌ను కొల‌త‌ల్లో ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం ఉంది. కొన్ని ప‌దార్థాల‌ను కొంత‌మంది ఎక్కువ మోతాదులో వాడుతారు. మ‌రికొంత‌మంది వేరే ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అందుకే కొల‌త‌ల్లో ఇవ్వ‌కుండా జొన్న‌పిండి తీసుకునే ప‌రిమాణాన్ని బ‌ట్టి మిగిలిన ప‌దార్థాల‌ను ఎవ‌రి ఇష్టానుసారం వారు తీసుకోవ‌చ్చు.

కావాల్సిన ప‌దార్థాలు:

జొన్న పిండి, నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు లేదా స‌న్న‌గా త‌రిగిన ఉల్లి ఆకులు, ప‌చ్చి మిర్చి, కొద్దిగా ఎండు మిర్చి కారం, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, కొత్తిమీర‌, పుదీనా, వ‌డ‌లు కాల్చ‌డానికి స‌రిప‌డా నూనె, పిండి క‌లుపుకోవ‌డానికి నీళ్లు, రుచికి స‌రిప‌డా ఉప్పు.

త‌యారీ విధానం:

ముందుగా పిండి క‌లుపుకోవ‌డానికి ఒక పాత్ర తీసుకోవాలి. పాత్ర‌లో నాన‌పెట్టిన శ‌న‌గ‌ప‌ప్పును క‌చ్చ‌పచ్చాగా రుబ్బుకోవ‌చ్చు లేదా అలాగే అయినా వేసుకోవాలి. ఆ త‌రువాత జొన్న‌పిండి, ఉల్లి త‌రుగు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి, ఎండుకారం, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, కొత్తిమీర‌, పుదీనా, ఉప్పు వేసుకొని బాగా క‌ల‌పాలి. ఆ త‌రువాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ వ‌డ చేయ‌డానికి అనువుగా క‌లుపుకోవాలి. పిండిని క‌లుపుకునేట‌ప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే వ‌డ‌లు క్రిస్పీగా వ‌స్తాయి.

అనంత‌రం స్ట‌వ్ ఆన్‌చేసి క‌డాయి పెట్టి స‌రిప‌డా నూనె పోసి బాగా వేడి కానివ్వాలి. త‌రువాత ముందుగా సిద్ధంగా చేసుకున్న పిండిని వ‌డ‌లుగా వ‌త్తుకొని వేడినూనెలో వేసి రెండు వైపులా బాగా కాల‌నివ్వాలి. అంతే జొన్న‌పిండి వ‌డ‌లు రెడీ.. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

పోష‌క విలువ‌లు

జొన్న వ‌డ‌లు తీసుకుంటే క్యాల్షియం, ఐర‌న్‌, పిండిప‌దార్థాలు, పీచుప‌దార్థాలు, ప్రోటీన్లు, మంచి కొవ్వు శ‌రీరానికి అందుతాయి.

Latest News