Site icon vidhaatha

Srisailam Temple | శ్రీశైలం వెళ్లే భక్తులకు అలెర్ట్‌..! ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత..! ఎప్పటి నుంచంటే..?

Srisailam Temple | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మార్చి ఒకటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆర్జిత సేవలు, స్పర్శ దర్శాలను రద్దు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వేలాది మంది భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలిరానున్నారు.


ఈ క్రమంలో భక్తులందరికీ అలంకార దర్శనాలను కల్పించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మార్చి ఒకటి నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


శివస్వాములకు ఒకటి నుంచి 5వ తేదీ వరకు సాయంత్రం వరకు నిర్ధిష్ఠ సమయాల్లో ఉచితంగా స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పారు. 5న రాత్రి 7.30 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామి అలంకార దర్శనానికి అనుమతి ఉంటుంది పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలు కల్పిస్తామన్నారు. ఆన్‌లైన్‌, కరెంటు బుకింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఈవో పేర్కొన్నారు.


శివరాత్రి సందర్భంగా పాదయాత్రగా క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం అటవీ ప్రాంతాల్లో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. వైద్యం, మంచినీరు. శౌచాలయాలు, చలువ పందిళ్లు వేస్తున్నారు. గత ఏడాది కంటే 20శాతం ఏర్పాట్లు ఎక్కువగా చేయాలని ఈవో సిబ్బందికి సూచించారు

Exit mobile version