Srisailam Temple| సందర్శకుల రద్ధీ..శ్రీశైలంలో స్పర్శదర్శనం నిలిపివేత

విధాత : శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేశారు. భక్తులందరూ ఈ మార్పును గమనించాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా క్షేత్రంలో భారీగా భక్తులరద్దీ పెరిగిందన్నారు. భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉందని ముందస్తుగా స్వామివారి స్పర్శదర్శనాలు నిలుపుదల చేశామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ వారంలో 15న మంగళవారం నుంచి 18న శుక్రవారం కల్పించే ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేసినట్లుగా వెల్లడించారు.

సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేస్తున్నట్లుగా తెలిపారు.