Site icon vidhaatha

Pakistani Spy Arrested: హానీ ట్రాప్ వలలో విద్యార్థి..పాక్ కు భారత మిలటరీ రహస్యాల చేరవేత!

Pakistani Spy Arrested: హనీ ట్రాప్ కు గురై పాకిస్తాన్ గూఢచారిగా మారిన హర్యానా రాష్ట్రం పటియాల విద్యార్థి దేవేంద్ర సింగ్(25)ను పోలీసులు అరెస్టు చేశారు. దేవేంద్ర సింగ్ హనీ ట్రాప్ తో 2024 లో కర్తార్‌పుర్‌ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడని అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. పటియాలలోని ఖల్సా కళాశాలలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దేవేంద్ర సింగ్‌ ధిల్లాన్‌ మే 12న తన ఫేస్‌బుక్ లో గన్, పిస్టల్ ఫొటోలు పోస్ట్ చేయడంతో అతనిపై నిఘా పెట్టారు. పాకిస్తాన్ ఐఎస్ఐ హానీట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక స్థావరాల వివరాలను, ఇతర రహస్యాలను దేవేంద్ర సింగ్ పాకిస్తాన్‌కు అందించినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు అతడికి పాక్ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టచెప్పినట్లుగా వెల్లడించారు. పటియాల మిటటరీ కంటోన్మెంట్ కు సంబంధించిన చిత్రాలను పాక్ అధికారులకు అందించాడని, దేవేంద్ర సింగ్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఫొరెన్సిక్ విచారణకు పంపించామని పేర్కొన్నారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెకానిక్ రవీంద్రకుమార్ సైతం పాక్ హనీ ట్రాప్ కు గురై ఐఎస్ఐకి భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడు. గగన్ యాన్ ప్రాజెక్టు వివరాలను అందించాడని విచారణలో పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Exit mobile version