సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ న్యూస్ ప్రెజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలను ఉద్దేశించి ఇటీవల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. దీంతో ఆయనను హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న నివాసంలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్ లో కేసు నమోదైంది. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు.