DAILY HOROSCOPE | 05. 03. 2023 ఆదివారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి ధ‌న వృద్ధి

మేష రాశి: మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. జ్వరము మొదలగు శరీర బాధలు కలగవచ్చును. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. కుటుంబ స‌భ్యుల‌పై అపవాదులు బాధను కలిగిస్తాయి. వృషభ రాశి: కుటుంబ సభ్యులతో శుభాకార్య విషయమై సమాలోచనలు జరుపుతారు. నూతన వస్తువులను సంగ్రహిస్తారు. బంధుమిత్రుల సమాగమము ఉల్లాసాన్నిస్తుంది. మనోధైర్యముతో చేసిన‌ ప్రయత్నములు ఫలిస్తాయి. మిథున రాశి: సోమరితనం వలన పనులు వాయిదా వేస్తారు. స్థిరాస్థి మూలక అశాంతి కలుగవచ్చును. ఆదాయమును మించిన ధ‌న‌ వ్యయముంటుంది. నిర్మాణ కార్యక్రమాలలో అసౌకర్యం […]

  • Publish Date - March 5, 2023 / 12:31 AM IST

మేష రాశి: మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. జ్వరము మొదలగు శరీర బాధలు కలగవచ్చును. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. కుటుంబ స‌భ్యుల‌పై అపవాదులు బాధను కలిగిస్తాయి.

వృషభ రాశి: కుటుంబ సభ్యులతో శుభాకార్య విషయమై సమాలోచనలు జరుపుతారు. నూతన వస్తువులను సంగ్రహిస్తారు. బంధుమిత్రుల సమాగమము ఉల్లాసాన్నిస్తుంది. మనోధైర్యముతో చేసిన‌ ప్రయత్నములు ఫలిస్తాయి.

మిథున రాశి: సోమరితనం వలన పనులు వాయిదా వేస్తారు. స్థిరాస్థి మూలక అశాంతి కలుగవచ్చును. ఆదాయమును మించిన ధ‌న‌ వ్యయముంటుంది. నిర్మాణ కార్యక్రమాలలో అసౌకర్యం కలుగవచ్చును.

కర్కాటక రాశి: ఆనందమయ జీవనంతో రోజు గడుస్తుంది. విద్యార్థులు చర్చలలో పాల్గొనడం ఉల్లాసాన్నిస్తుంది. నూతన వస్త్ర ప్రాప్తి సంతోషాన్నిస్తుంది. సన్మానాది గౌరవములను పొందుతారు.

సింహ రాశి: ప్రయాణ మూలక అశాంతి కలుగవచ్చును అవమానములు ఎదుర‌వుతాయి. ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం మంచిది. పితృవర్గము వారితో విభేదాలు కలుగుతాయి.

కన్యా రాశి: శత్రుబాధలు తొలగిపోతాయి. పరోపకారము వలన గౌరవ మర్యాద‌లు లభిస్తాయి. సరియైన ఆలోచనలతో ముందుకెళ్ళడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. విశేష లాభాములు సంతోషాన్నిస్తాయి.

తులా రాశి: మీరు కోరుకున్న స్థానం లభిస్తుంది. శరీర బాధలు ఉపశమిస్తాయి. మంచి సందేశాలు వినడం వలన భావోద్వేగం కలుగుతుంది. ఆహార నియమాలను పాటించండి. అసూయపరులకు దూరంగా వుండండి.

వృశ్చిక రాశి: గృహ మూలక సౌఖ్యం లభిస్తుంది. స్థిరాస్థి విషయమై పనులు సానుకులంగా సాగుతాయి. మిత్రుల మూలంగా అనుకూలతలు సంతోషాన్నిస్తాయి. ధన, ధాన్య, సమృద్ది కలుగుతుంది.

ధనుస్సు రాశి: సంతాన మూలక సంతోషములు కలుగుతాయి. పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. ఆదాయములో వృద్ధి సంతోషాన్నిస్తుంది. వాహన మూలక లాభ‌ములు కలుగవచ్చును.

మకర రాశి: వ్యాపారస్థులకు లాభదాయకంగా వుంటుంది. కళాకారులకు, అనుకోని అవకాశాలు ఆనందాన్నిస్తాయి, కుటుంబ మూలక సౌఖ్యం లభిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది.

కుంభ రాశి: వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. మంచి మాటలను వినడం వలన ఆనందం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.

మీన రాశి: వృత్తి, ఉద్యోగాలలో చిక్కుల మూలంగా అశాంతి కలుగుతుంది. ఆకస్మిక సంఘటనలు భయాన్ని కలిగిస్తాయి. క‌ర, పాద‌ బాధలు కలుగవచ్చును. అధిక ధ‌న వ్య‌యం ఉండ‌వ‌చ్చును.
.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి, కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332