Supermoon
విధాత: జాబిలమ్మ రావే పాటను విన్న చందమామ (Moon) ఒక్కసారిగా భూమికి దగ్గరగా వచ్చేసింది. 2023 సూపర్ మూన్ (Super Moon) కనిపించే సంవత్సరం కావడంతో సోమవారం ఆకాశంలో భారీ జాబిలి దర్శనం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రసిద్ధ ప్రదేశాల్లో చందమామ అందాలు ఇవి..
మొదటి ఫొటో: ఇరాక్‌లోని బస్రా నగరం
రెండో ఫొటో: ఇండోనేసియాలోని లంబారో నగరం
మూడో ఫొటో: దుబాయ్‌లోని ఒక మసీదు మినారు నుంచి తీసిన ఫొటో
నాలుగో పొటో: ఇరాక్‌లోని ఓ నగరంలో చంద్రోదయం
అయిదో ఫొటో: ప్యారిస్‌లోని ప్రఖ్యాత కట్టడం పాంట్ దే బెర్సీ వద్ద
భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. అందు వల్లే కొన్ని సందర్భాల్లో భూమికి కాస్త దగ్గరగా జాబిల్లి వస్తుంది. దీనినే సూపర్ మూన్ అంటారు.
2023 సూపర్ మూన్ సంవత్సరం కాగా.. జులై నెలలో ఈ ప్రకృతి అద్భుతం మరింత కనువిందు చేస్తుంది. ఈ నెలలో కనిపించే చందమామని అమెరికన్ వాసులు బక్‌మూన్ అని పిలుస్తారు. సాధారణంగా భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కి.మీ. కాగా ఇప్పుడది 3,61,934 కి.మీ.గా ఉంది.