Site icon vidhaatha

Suryapeta | ఫణిగిరిలో బౌద్ధ మ్యూజియం: మంత్రి జగదీశ్‌రెడ్డి

Suryapeta

విధాత: సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో బౌద్ధ మ్యూజియం ఏర్పాటుకు విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మంగళవారం స్థల పరిశీలన చేశారు. మంగళవారం తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్‌ కుమార్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అర్కియాలజీ సెక్రెటరీ శైలజ రామయ్యర్ తో కలిసి మంత్రి స్థల పరిశీలన చేశారు.

ఫణిగిరిలో 2000 సంవత్సరం నుంచి 2018 వరకు జరిపిన త్రవ్వకాలలో లభించిన విగ్రహాలను, పురావస్తు సంపదను అన్నింటిని అర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ హైదరాబాద్‌లోని మ్యూజియం నందు భద్రపరిచారు. ఆయా పురావస్తు సంపదను ప్రజల సందర్శన కోసం ఫణిగిరిలోని బౌద్ధ క్షేత్రం వద్ద గల రామాలయం గుడి వద్ద తాత్కాలిక మ్యూజియం ఏర్పాటుకు మంత్రి స్థల పరిశీలన చేశారు.

పర్యాటకులు సందర్శించడానికి ఫణిగిరిలో 50 రోజులలో సందర్శనశాల నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సందర్శనశాల పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ బయల్పడిన బౌద్ధ విగ్రహాలను సందర్శనశాలలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్కియాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ కు మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డిఓ వీర బ్రహ్మచారి, డిప్యూటీ డైరెక్టర్ ఆర్. కాళోజీ నారాయణ, డిప్యూటీ డైరెక్టర్ మ్యూజియం బి.నాగరాజు, సూర్యాపేట ఆర్కియాలజీ డిప్యూటీ డైరెక్టర్ డి.బుజ్జి, గ్రామ సర్పంచ్ కే.ఉప్పలయ్య, డిఎస్పీ నాగభూషణం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version