యూనివ‌ర్సిటీల్లో చదువుకు మ‌హిళ‌లపై నిషేదం: తాలిబ‌న్లు

ఇస్లాం ష‌రియ‌త్‌ను అమ‌లు చేస్తున్నామంటూ అమాన‌వీయ శిక్ష‌లు విధాత‌: ఆఫ్ఘ‌న్ పాల‌కులైన తాలిబ‌న్ల‌లో ఏ మార్పు రాలేదు. 90వ ద‌శ‌కంలో తాలిబ‌న్ల పాల‌న‌లో ఆఫ్ఘ‌న్ పౌరులు ఎదుర్కొన్న అమానుష‌ నిబంధ‌న‌లు, అణిచివేత‌లు తిరిగి అమ‌లులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఇస్లాం ష‌రియ‌త్ పేరుతో బ‌హిరంగ శిక్ష‌లు, మ‌హిళ‌ల‌పై క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. తాజాగా మ‌హిళ‌లు యూనివ‌ర్సిటీల్లో చ‌దవ‌టాన్ని నిషేధిస్తూ తాలిబ‌న్ ప్ర‌భుత్వం చ‌ట్టం జారీ చేసింది. అమిద్ క‌ర్జాయ్‌, అశ్ర‌ఫ్ గ‌నీ త‌దిత‌రుల పాల‌న‌ను వ్య‌తిరేకిస్తూ తాలిబ‌న్లు […]

  • Publish Date - December 21, 2022 / 10:52 AM IST
  • ఇస్లాం ష‌రియ‌త్‌ను అమ‌లు చేస్తున్నామంటూ అమాన‌వీయ శిక్ష‌లు

విధాత‌: ఆఫ్ఘ‌న్ పాల‌కులైన తాలిబ‌న్ల‌లో ఏ మార్పు రాలేదు. 90వ ద‌శ‌కంలో తాలిబ‌న్ల పాల‌న‌లో ఆఫ్ఘ‌న్ పౌరులు ఎదుర్కొన్న అమానుష‌ నిబంధ‌న‌లు, అణిచివేత‌లు తిరిగి అమ‌లులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఇస్లాం ష‌రియ‌త్ పేరుతో బ‌హిరంగ శిక్ష‌లు, మ‌హిళ‌ల‌పై క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. తాజాగా మ‌హిళ‌లు యూనివ‌ర్సిటీల్లో చ‌దవ‌టాన్ని నిషేధిస్తూ తాలిబ‌న్ ప్ర‌భుత్వం చ‌ట్టం జారీ చేసింది.

అమిద్ క‌ర్జాయ్‌, అశ్ర‌ఫ్ గ‌నీ త‌దిత‌రుల పాల‌న‌ను వ్య‌తిరేకిస్తూ తాలిబ‌న్లు పోరాటం ప్రారంభించారు. అమెరికా తొత్తు ప్ర‌భుత్వాలు ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టి జాతి సంస్కృతిని నాశ‌నం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా క‌ర్జాయ్‌కి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున సాయుధ పోరాటాన్ని లేవ‌దీశారు. నిజానికి గ‌తంలో తాలిబ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు ఎదుర్కొన్న క‌ష్ట‌, న‌ష్టాల నుంచే అమిద్ క‌ర్జాయ్ లాంటి వారు అమెరికా అండ‌తో అధికారంలోకి వ‌చ్చారు.

గ‌త అనుభ‌వాల నేప‌థ్యంలో మొద‌ట తాలిబ‌న్ల‌లో కాలానుగుణంగా మార్పులు వ‌చ్చిన‌ట్లు క‌నిపించింది. అనేక రూపాల్లో ఆధునిక‌త సంత‌రించుకున్న‌ట్లు వారే ఓ సంద‌ర్భంలో ప్ర‌క‌టించుకున్నారు. గ‌త తాలిబ‌న్ విధానాల‌తో త‌మ‌ను పోల్చ‌వ‌ద్ద‌ని హైబ‌తుల్లా అఖుంజాదా, అబ్దుల్‌గ‌ని బ‌రాద‌ర్ లాంటి అగ్ర‌శ్రేణి తాలిబ‌న్ నేత‌లు తెలిపారు.

ఆ క్ర‌మంలోనే వీరికి ప్ర‌జాద‌ర‌ణ ల‌భించింది. ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు కూడా క‌ర్జాయ్ పాల‌న‌తో విసిగిపోయి తాలిబ‌న్ల మాట‌ల‌ను విశ్వ‌సించారు. నిరుద్యోగాన్ని రూపుమాపి ఆత్మ‌గౌర‌వాన్ని నిలుపుతార‌ని ఆశించారు. తీరా 2021 ఆగ‌స్టు 15న అధికారం చేజిక్కించుకున్న త‌ర్వాత క్ర‌మ క్ర‌మంగా తాలిబ‌న్లు త‌మ విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఆధునిక ప్ర‌జాస్వామిక విలువ‌ల‌కు తిలోదకాలిచ్చి ఇస్లాం ష‌రియ‌త్‌నే పాటించాల‌ని ప్ర‌జ‌ల‌ను శాసిస్తున్నారు. ఇప్ప‌టికే చిన్న త‌ప్పుకు కూడా బ‌హిరంగ శిక్ష‌లు, కొర‌డా దెబ్బ‌లు శిక్ష‌గా అమ‌లు చేస్తున్న తాలిబ‌న్లు.. తాజాగా మ‌హిళ‌లు యూనివ‌ర్సిటీల్లో చ‌దవకూడ‌ద‌ని నిషేధం విధించారు.

ఇప్ప‌టికే సెకండ‌రీ పాఠ‌శాల‌ల నుంచి ల‌క్ష‌లాది మంది బాలిక‌లు విద్య‌కు దూర‌మయ్యారు. త‌మ‌ను యూనివ‌ర్సీటీ విద్య‌కు దూరం చేయ‌టం అమాన‌వీయం అంటూ.. ఆఫ్ఘ‌న్ అమ్మాయిలు విదేశీ మీడియాతో బిగ్గ‌ర‌గా రోదిస్తూ ఫోన్లో మాట్లాడటం గ‌మ‌నార్హం.