Hypertension | మొబైల్‌లో 30 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే.. ‘హై బీపీ’ వ‌చ్చే ఛాన్స్

Hypertension | ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ మొబైల్ ఫోన్ల‌లోనే మునిగి తేలుతున్నారు. అయితే సోష‌ల్ మీడియా యాప్స్‌లో కాల‌క్షేపం చేయ‌డం.. లేదంటే గంట‌ల కొద్ది ముచ్చ‌ట్లు పెట్ట‌డం. కానీ అధిక స‌మ‌యం ఫోన్‌లో ముచ్చ‌టిస్తే ప్ర‌మాదమ‌ని ప‌రిశోధకులు తేల్చారు. వారానికి 30 నిమిషాల కంటే ఎక్కువ స‌మ‌యం ఫోన్‌లో మాట్లాడితే హై బీపీని( Blood Pressure) కొని తెచ్చుకున్న‌ట్లే అని పేర్కొంటున్నారు. వారానికి 30 నిమిషాల పాటు ఎక్కువ స‌మ‌యం మొబైల్‌లో మాట్లాడిన వారిలో.. 12 శాతం […]

  • Publish Date - May 6, 2023 / 03:21 AM IST

Hypertension |

ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ మొబైల్ ఫోన్ల‌లోనే మునిగి తేలుతున్నారు. అయితే సోష‌ల్ మీడియా యాప్స్‌లో కాల‌క్షేపం చేయ‌డం.. లేదంటే గంట‌ల కొద్ది ముచ్చ‌ట్లు పెట్ట‌డం. కానీ అధిక స‌మ‌యం ఫోన్‌లో ముచ్చ‌టిస్తే ప్ర‌మాదమ‌ని ప‌రిశోధకులు తేల్చారు. వారానికి 30 నిమిషాల కంటే ఎక్కువ స‌మ‌యం ఫోన్‌లో మాట్లాడితే హై బీపీని( Blood Pressure) కొని తెచ్చుకున్న‌ట్లే అని పేర్కొంటున్నారు.

వారానికి 30 నిమిషాల పాటు ఎక్కువ స‌మ‌యం మొబైల్‌లో మాట్లాడిన వారిలో.. 12 శాతం అధికంగా హై బీపీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. మొబైల్ ఫోన్ల ద్వారా త‌క్కువ స్థాయిలో రేడియోఫ్రీక్వెన్సీ ఎన‌ర్జీ రిలీజ‌వుతుంద‌ని, ఆ ఎన‌ర్జీ వ‌ల్ల బ్ల‌డ్ ప్రెజ‌ర్ పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నంలో తేలింది. కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుండెపోటు మ‌ర‌ణాల‌కు హైప‌ర్‌టెన్ష‌న్ ముఖ్య కార‌ణ‌మ‌న్న విష‌యం తెలిసిందే.

చైనాకు చెందిన‌ స‌ద‌ర‌న్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ గ్జియాన్‌వూ క్విన్ ఈ అంశంపై ఓ నివేదిక‌ను తయారు చేశారు. మొబైల్ ఫోన్ ఎంత సేపు మాట్లాడార‌న్న అంశంపై గుండె ఆరోగ్య స్థితి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తెలిపారు. ఒక‌వేళ అధిక స‌మ‌యం మొబైల్‌లో మాట్లాడితే అప్పుడు రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని క్విన్ తెలిపారు. యురోపియ‌న్ హార్ట్ జ‌న‌ర‌ల్.. డిజిట‌ల్ హెల్త్‌లో ఈ రిపోర్టును ప‌బ్లిష్ అయింది.

37 ఏండ్ల నుంచి 73 ఏండ్ల‌ మ‌ధ్య ఉన్న సుమారు 2,12,046 మందిపై అధ్య‌య‌నం నిర్వ‌హించారు. మొబైల్ ఫోన్‌లో వారానికి 30 నిమిషాల క‌న్నా ఎక్కువ మాట్లాడేవారిలో 12 శాతం అధికంగా హైబీపీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తేల్చారు. మ‌హిళ‌లైనా, పురుషులైనా ప్ర‌మాదం అంతే ఉంటుంద‌ని స‌ర్వేలో తేల్చారు.

వారంలో గంట లోపు మాట్లాడేవారికి 8 శాతం, మూడు గంట‌ల పాటు ఫోన్లో మాట్లాడేవారికి 13 శాతం, ఆరు గంట‌లు మాట్లాడేవాళ్ల‌కు 16 శాతం, ఆరు క‌న్నా ఎక్కువ గంట‌లు మాట్లాడేవారికి 25 శాతం అధికంగా హైబీపీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక జ‌న్యుప‌ర‌మైన సమ‌స్య‌లు ఉన్న‌వారిలో హైబీపీ 33 శాతం అధికంగా ఉంటుంద‌న్నారు.

Latest News