Health Tips | చలికాలం( Winter ) అంటేనే వేడి వేడి ఆహార పదార్థాలు( Food Items ) తినాలని అనిపిస్తుంటుంది. అంతేకాదు.. బయటి ఆహారం తీసుకునేందుకు ఎక్కువగా ఇష్ట పడుతుంటాం. సాయంత్రం కాగానే చల్లని వాతావరణానికి వేడి వేడి మిర్చిలు, చిప్స్, పకోడీలు, మంచురియా వంటి ఆహార పదార్థాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వీటిని నిల్వ ఉంచేందుకు ఎక్కువగా ఉప్పు( Salt ) వినియోగిస్తుంటారు. ఇలా ఉప్పు అధికంగా వినియోగించే ఆహార పదార్థాలను తినడం వల్ల అనేక రోగాల( Diseases ) బారిన పడే ప్రమాదం ఉంది. మరి ముఖ్యంగా రక్తపోటు( Blood Pressure ) అధికమై గుండెపోటు( Heart Stroke )కు దారి తీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు. మరి ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే వచ్చే రోగాలేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
మూత్రపిండాలకు ప్రమాదం..!
ఇంట్లో వండిన పదార్థాల్లో కానీ, బయటి ఆహార పదార్థాల్లో కానీ ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పు మోతాదు కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత మూత్రపిండాల పనితీరు నెమ్మదించి.. ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. కిడ్నీలు కూడా సోడియంను ఫిల్టర్ చేసేందుకు సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. కాబట్టి ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుని, మూత్రపిండాలను కాపాడుకోండి.
ఎముకల బలహీనత
ఉప్పును మోతాదు కంటే అధిక స్థాయిల్లో తీసుకున్నప్పుడు శరీరంలోని ఎముకలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎముకలు బలహీనపడిపోతాయి. ఎందుకంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపిస్తుంది. ఇది ఎముకల బలానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండె జబ్బులు
రుచి కోసం చాలా మంది ఉప్పును అధిక మోతాదులో తీసుకుంటారు. ఇలా ఉప్పును ఎక్కువగా వంటకాల్లో ఉపయోగించడం వల్ల దాన్ని మనం తింటే.. అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. సోడియం రక్తంలోని నీటి పరిమాణాన్ని పెంచి.. కణాలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా గుండెపై ప్రభావం చూపి గుండె జబ్బులకు ఆస్కారం ఉంటుంది.
బరువు పెరగడం
చలికాలంలో పకోడీలు, సమోసాలు, చాట్ వంటి వేయించిన ఆహారం ఎక్కువగా తింటారు. వీటిలో ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరగవచ్చు. బరువుకు కారణమయ్యే ఉప్పుకు దూరంగా హెల్తీగా ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి :
Scrub Typhus : ఏపీలో స్క్రబ్ టైఫస్ పంజా..15 మందికి పైగా మృతి
Phone Tapping Case| ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు
