తారకరత్న రెడీ ఐనట్లేనా!.. లోకేష్‌తో భేటీ అందుకేనా!!

విధాత‌: ఎన్నికలు సమీపిస్తున్న‌ తరుణంలో టిడిపికి నందమూరి కుటుంబం ఫ్లేవర్ అద్దడానికి అటు చంద్రబాబు గట్టిగా యత్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా తీసుకురావాలని డిమాండ్స్ వస్తున్నా అది సాధ్యం అవుతుందో లేదో తెలియ‌డం లేదు. చంద్రబాబు పాల్గొనే కొన్ని సభల్లో జూనియర్ ఎన్టీఆర్ కోసం నినాదాలు కూడా వస్తున్నాయి. కానీ ఆయన వస్తారా.. తాతగారి పార్టీ కోసం పని చేస్తారా..? ఇదంతా సందేహమే కానీ ఎన్టీఆర్ ఇంకో మనవడు తారక రత్న మాత్రం ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా […]

  • Publish Date - January 11, 2023 / 07:41 AM IST

విధాత‌: ఎన్నికలు సమీపిస్తున్న‌ తరుణంలో టిడిపికి నందమూరి కుటుంబం ఫ్లేవర్ అద్దడానికి అటు చంద్రబాబు గట్టిగా యత్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా తీసుకురావాలని డిమాండ్స్ వస్తున్నా అది సాధ్యం అవుతుందో లేదో తెలియ‌డం లేదు.

చంద్రబాబు పాల్గొనే కొన్ని సభల్లో జూనియర్ ఎన్టీఆర్ కోసం నినాదాలు కూడా వస్తున్నాయి. కానీ ఆయన వస్తారా.. తాతగారి పార్టీ కోసం పని చేస్తారా..? ఇదంతా సందేహమే కానీ ఎన్టీఆర్ ఇంకో మనవడు తారక రత్న మాత్రం ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు.

ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ అవసరం అయితే జూనియర్ వస్తాడని.. రప్పిస్తామని అంటూనే తాను మాత్రం పోటీ చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో తారక రత్న గుడివాడ నుంచి బరిలో దిగుతారని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు కూడా గుడివాడ నియోజకవర్గంలో ఉండడం. ఎన్టీఆర్ అభిమానులు సైతం దన్నుగా ఉంటారన్న నమ్మకంతో గుడివాడ నుంచి కొడాలి నాని మీద పోటీకి సిద్ధం అవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించారు. గుడివాడ నుంచి తాను పోటీ చేయాలని భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా .. తారకరత్న సంకేతాలు ఇస్తున్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కొడాలి నానిని ఢీకొనాలంటే అంతకన్నా బలమైన నాయకుడు ఉండాలని టిడిపి చూస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటికి ఒక ఎన్నారై సహా… మరో నేత రంగంలో ఉన్నారని తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు కొడాలిని ఎదిరించే సత్తా ఉన్న నాయకుడు టీడీపీకి అవసరం ఉంది. అయితే తన తాత ఎన్టీఆర్ తరువాత తమ కుటుంబం నుంచి ఎవరూ ఈ ప్రాంతంలో పోటీ చేయనందున తనకు ఈసారి మంచి మద్దతు దక్కుతుందని తారకరత్న ఆశిస్తున్నారు. తాను బరిలో దిగితే.. జూనియర్ కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు. ఈ పాయింట్స్ అన్నీ లోకేష్‌తో చర్చించారని అంటున్నారు..