Site icon vidhaatha

Venugopal Rao | బిగ్‌బాస్‌-7లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ వేణుగోపాల్‌రావు..!

Venugopal Rao | తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌కు మంచి రెస్పాన్స్‌ ఉంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకొని.. త్వరలో ఏడో సీజన్‌ను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఏడో సీజన్‌కు సంబంధించిన లోగోను సైతం విడుదలైంది. త్వరలోనే సీజన్‌కు సంబంధించిన ప్రోమో సైతం విడుదలకానున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఆరో సీజన్‌లో బిగ్‌బాస్‌ షో అలరించలేకపోయింది. ఆ తర్వాత ఇక బిగ్‌బాస్‌ షో ముగిసినట్లేనని అందరూ భావిస్తూ వచ్చారు. కాస్త ఆలస్యమైనా షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నది.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి కంటెస్టెంట్స్‌ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నది. రెమ్యునరేషన్‌ ఎక్కువైనా రాజీపడకుండా స్టార్‌ సెలబ్రెటీలను తీసుకువస్తున్నట్లు టాక్‌ నడుస్తుంది. ఇప్పటికే పలువురి వెండితెర, బుల్లితెర స్టార్స్‌తో పాటు పలువురు ప్రముఖలు బీబీ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ వేణుగోపాల్‌ పేరు సైతం బిగ్‌బాస్‌ షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. టీమిండియాకు వేణుగోపాల్‌రావు ఆడారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ సత్తాచాటారు.

తాజాగా బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరకానున్నాడు. ఇన్ని రోజులు మైదానంలో ఆటగాడిగా చూసిన అతన్ని.. బీబీ హౌస్‌లో సరికొత్త కోణాల్ని ఎలా చూపబోతున్నాడో ఇక వేచి చూడాల్సిందే. మరో వైపు ఈ సారి సీజన్‌లో ఎక్కువగా జంటలను షోలోకి తీసుకురాబోతున్నారని తెలుస్తున్నది. ఇందులో విడాకులు తీసుకున్న జంట సైతం ఉన్నట్లు సమాచారం. గత సీజన్స్‌తో పోలిస్తే సరికొత్త టాస్క్‌లు ఉండేలా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. బిగ్‌బాస్‌ అన్ని సీజన్లలో కేవలం ఐదో సీజన్‌ మాత్రమే స్టార్‌ మీ ఇండియాలోనే టాప్‌ రేటింగ్స్‌ దక్కించుకున్న ఛానల్‌గా రికార్డు సృష్టించింది. ఆరో సీజన్‌ అట్టర్‌ ఫ్లాప్‌గా నిలువగా.. ఈ సారి ఏడో సీజన్‌ ఎలా ఉండబోతున్నదో వేచి చూడాల్సిందే.

Exit mobile version