తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కిడ్నాప్?

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కిడ్నాప్‌ కు గురయ్యారని సమాచారం. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హైదరాబాద్ నారాయణ గూడ ఏరియాలో గాదె ఇన్నయ్యను అజ్

విధాత, వరంగల్: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కిడ్నాప్‌  కు గురయ్యారని సమాచారం. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హైదరాబాద్ నారాయణ గూడ ఏరియాలో గాదె ఇన్నయ్యను అజ్ఞాత వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. పోలీసులమని చెప్పుకున్న కొందరు వ్యక్తులు గాదె ఇన్నయ్యను తీసుకెళ్ళారని‌ సమాచారం. గాదె ఇన్నయ్యకు ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు, మిత్రులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నయ్య వరంగల్ జిల్లాకు చెందిన వారు కావడంతో ఈ సంఘటన పట్ల చర్చజరుగుతోంది.