ముగిసిన పోలింగ్.. క్యూలైన్లలో భారీగా ఓటర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం 5గంటలతో ముగిసిపోగా, అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లలో ఓటర్లు వేచివున్నారు

  • Publish Date - November 30, 2023 / 11:43 AM IST

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం 5గంటలతో ముగిసిపోగా, అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లలో ఓటర్లు వేచివున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో మరో గంట నుంచి రెండు గంటల పాటు ఓటింగ్ జరిగే పరిస్థితి నెలకొంది. ముందుగా మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లోని 13నియోజకవర్గాలు సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్‌, మంధని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలంలలో పోలింగ్‌కు 4గంటలకే ముగిసింది.


కాగా మిగతా 106నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు 5గంటలకల్లా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉండటంతో వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో తుది ఓటింగ్ శాతం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో పెరిగిన పోలింగ్‌, మరికొన్ని చోట్ల తగ్గిన పోలింగ్ ఎవరి జయపజయాలపై ప్రభావం చూపుతుందోనని అభ్యర్థులను టెన్షన్ పెడుతుంది.