ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఉద్యోగి మృతి

మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామం 248 పోలింగ్ బూత్ లో విషాదం చోటుచేసుకుంది.

  • Publish Date - November 30, 2023 / 08:57 AM IST

విధాత, మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామం 248 పోలింగ్ బూత్ లో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న సుధాకర్ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది.


కాగా.. సుధాకర్ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో వెటర్నరీ విభాగంలో సహాయకుడిగా పని చేస్తున్నారు. ఎన్నికల అధికారులు బంధువులను పిలిపించి సుధాకర్ మృతదేహాన్ని అప్పజెప్పారు. ఘటనతో తోటి ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.