Site icon vidhaatha

Gaddar | అంద‌రి గుండెల్లో గ‌ద్ద‌ర్.. ఆ మూడు పాట‌లు ఎవ‌ర్‌గ్రీన్

Gaddar | త‌న గానంతో కోట్లాది మంది హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న గ‌ద్ద‌ర్ అస్త‌మించారు. పొడుస్తున్న పొద్దు మీద అనే పాట‌తో తెలంగాణ ఉద్య‌మాన్ని ఉర్రూత‌లూగించారు. మ‌ల్లెతీగ‌కు పందిరి వోలే పాట‌తో అన్న‌చెల్లెల మ‌ధ్య అనుబంధాన్ని ప‌దికాలాల పాటు గుర్తుండేలా చేశారు. బండెన‌క బండి క‌ట్టి అనే పాట‌తో దొర‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించారు. ఈ మూడు ఎప్ప‌టికీ ప్ర‌జ‌ల గుండెల్లో స‌జీవ‌మై ఉంటాయ‌న‌డంలో సందేహాం లేదు. ఈ మూడు పాట‌ల‌తో పాటు అడ‌వి త‌ల్లికి వంద‌నం, పొద్దుతిరుగుడు పువ్వా, భ‌ద్రం కొడుకో, జం జ‌మ‌ల‌బ‌రి, మేలుకో రైత‌న్న వంటి పాట‌లు ప్ర‌జ‌ల‌ను ఇప్ప‌టికీ అల‌రిస్తూనే ఉంటాయి.

గ‌ద్ద‌ర్ వెండి తెర‌పై కూడా ప‌లుమార్లు క‌నిపించారు. రంగుల క‌ల సినిమాలో న‌టించారు. ఓరేయ్ రిక్షా సినిమాలో గద్దర్‌ రాసిన మల్లెతీగకు పందిరి వోలే పాట ఆల్‌టైమ్‌ ఎవర్‌గ్రీన్ సూపర్ హిట్‌గా నిలిచింది. గద్దర్‌ ఈ పాటకు నంది అవార్డు వస్తే.. తిరస్కరించారు. 2011లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రంలో గద్దర్ రాసిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాట‌కు బెస్ట్ ప్లే బ్యాక్ సింగ‌ర్‌గా నంది అవార్డు తెచ్చిపెట్టింది. 2019లో సుడిగారి సుధీర్ నటించిన సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌లో మేలుకో రైతన్న పాటను గ‌ద్ద‌ర్ రాశారు. గద్దర్‌ చివరగా సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో కీలక పాత్రలో నటించారు.

Exit mobile version