విధాత: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి ఉద్యోగం మరుగుజ్జు దివ్యాంగురాలైన రజినికి ఇస్తామని పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులకు ఆదేశించారు. పీజీ పూర్తి చేసినా ప్రైవేటులో, ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజిని రేవంత్‌ను ఆక్టోబర్‌లో కలిసి వినతి పత్రం అందించారు.
దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణా స్వీకారం ఉంటుందని, ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం నీకు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇది నా గ్యారంటీ అని రేవంత్ కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు. రేపు సీఎంగా ప్రమాణా స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి తన హామీ మేరకు రజినికి తొలి ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన ఆర్డర్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించడం విశేషం