విధాత: గ్రూప్-2కు సంబంధించి పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.
783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. 783 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలకు తేదీలు ప్రకటించిన విషయం విధితమే. జూన్ 5 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నది.
జూలై 1న గ్రూప్-4 పరీక్షలు నిర్వహించనున్నది. పరీక్షలకు వారం ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరించింది.