‘పద్మ’ అవార్డుల్లో తెలంగాణకు చోటు తక్కువే…!

విధాత: గణతంత్ర దినోత్సవాల సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2022 సంవత్సరానికి గాను ఆరుగురికి పద్మవిభూషణ్‌, 9మందికి పద్మ భూషణ్‌, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. పద్మ అవార్డులు పొందిన వారిలో… సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ, సంగీత విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ సహా ఆరుగురికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మభూషణ్, ముగ్గురికి పద్మశ్రీ ప్రకటించింది. ఆధ్యాత్మిక వేత్త […]

  • Publish Date - January 26, 2023 / 01:22 PM IST

విధాత: గణతంత్ర దినోత్సవాల సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2022 సంవత్సరానికి గాను ఆరుగురికి పద్మవిభూషణ్‌, 9మందికి పద్మ భూషణ్‌, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.

పద్మ అవార్డులు పొందిన వారిలో… సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ, సంగీత విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ సహా ఆరుగురికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది.

తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మభూషణ్, ముగ్గురికి పద్మశ్రీ ప్రకటించింది. ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి, కమలేశ్‌ డి పటేల్‌ను పద్మభూషణ్ వరించింది. అలాగే… మొదడుగు విజయ్‌ గుప్తా, హనుమంతరావు పసుపులేటి, బి. రామకృష్ణారెడ్డిని పద్మశ్రీ వరించింంది. ఏపీలో ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.

ఏపీ నుంచి పద్మ అవార్డులు పొందిన వారిలో కీరవాణి, గణేశ్‌ నాగప్ప కృష్ణ రాజనగర, సీవీ రాజు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, కోటా సచ్చితానంద, ప్రకాశ్‌ చంద్రసూద్‌, సంకురాత్రి చంద్రశేఖర్‌ను పద్మీశ్రీ వరించాయి.
ఇదిలా ఉంటే… తెలంగాణ నుంచి పద్మ అవార్డులు పొందిన వారిలో కూడా ఆంధ్రాకు చెందిన వారే ఉండటం గమనార్హం.