హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. క‌శ్మీర్‌ ఫైల్స్ ప్రదర్శనకు యత్నం

భారీగా మొహరించిన పోలీసులు కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నం మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించేందుకు ఎస్‌ఎఫ్ ఐ.. విధాత: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఒక వైపు ఎస్ఎఫ్ఐ, కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు గురువారం సాయంత్రం షాపింగ్‌ […]

  • Publish Date - January 26, 2023 / 02:57 PM IST
  • భారీగా మొహరించిన పోలీసులు
  • కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నం
  • మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించేందుకు ఎస్‌ఎఫ్ ఐ..

విధాత: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఒక వైపు ఎస్ఎఫ్ఐ, కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా పోలీసులు భారీగా మోహరించారు.

ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు గురువారం సాయంత్రం షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద వివాదాస్పద సినిమాల ప్రదర్శనకు సమాయత్తం కావడంతో యూనివర్సిటీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరిస్థితులు చేజారి పోతాయని భావించిన పాలక వర్గం.. ప్రదర్శనలకు అనుమతి ఇవ్వలేదు. అయినా గురువారం సాయంత్రం ఈ రెండు విద్యార్థి సంఘాల నేతలు ఆయా సినిమాలను ప్రదర్శించే ప్రయత్నం చేయడంతో వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ విద్యార్థులు క్యాంపస్‌ గేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. జోక్యం చేసుకున్న పోలీసులు రెండు విద్యార్థి సంఘాల నేతలతో చర్చించారు. రెండింటినీ ఒకేచోట ప్రదర్శించ వద్దని సూచించారని సమాచారం.

ఎల్‌హెచ్‌ హాస్టల్‌ వద్ద ఎస్‌ఎఫ్ఐ విద్యార్థులు మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి, నార్త్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏబీవీపీ విద్యార్థులు కశ్మీర్‌ ఫైల్స్‌ను ప్రదర్శించడానికి అనుమతించారని తెలిసింది. దీంతో సమస్య సద్దుమణిగింది. చివరకు రెండు విద్యార్థి సంఘాల నేతలు వేర్వేరుచోట్ల ఆయా సినిమాలను ప్రదర్శించారని సమాచారం.